బిగ్ బాస్ విన్నర్ కౌశల్ అంటూ సంబరాలు జరుపుకుంటున్న కౌశల్ ఆర్మీ… నిజం ఎంత?

ఏదైనా జరగవచ్చు అనే ట్యాగ్ లైన్ తో ప్రారంభం అయినా బిగ్ బాస్ రెండో సీజన్ లో ఎన్నో అనూహ్య పరిణామాలు జరిగాయి. బిగ్ బాస్ మొదటి సీజన్ తో పోలిస్తే బిగ్ బాస్ టాస్క్ ల్లో పదును పెరగటమే కాకుండా పార్టిసిపెంట్స్ కూడా చాలా సీరియస్ గా ఆడారు. దాదాపుగా 110 రోజులు జరిగిన బిగ్ బాస్ సీజన్ ముగింపు దశకు చేరుకుంది. రేపు జరిగే గ్రాండ్ ఫినాలే తో ముగుంపు పలుకుతారు. అయితే సోషల్ మీడియాలో కౌశల్ బిగ్ బాస్ విన్నర్ అంటూ వైరల్ అయింది. ప్రేక్షకుల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న కౌశల్ కి అత్యధికంగా ఓట్లు వచ్చాయని అందుకే బిగ్ బాస్ నిర్వాహకులు కౌశల్ ని బిగ్ బాస్ విజేతగా ప్రకటించారని ప్రచారం కొనసాగుతుంది.

కౌశల్ తర్వాతి స్థానం దీప్తి నల్లమోతు అని మూడో స్థానం గీతా మాధురి అని ప్రచారం సాగుతుంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన బిగ్ బాస్ విన్నర్ కౌశల్ అని కనపడుతుంది. గ్రాండ్ ఫినాలేకి విక్టరీ వెంకటేష్ వచ్చాడని వెంకటేష్ చేతుల మీదుగా కౌశల్ ట్రోఫీ తీసుకున్నాడని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ విషయంలో ఎంత నిజం ఉందో తెలియాలంటే రేపు సాయంత్రం వరకు ఆగవలసిందే.