ఎవరు ఊహించిన క్రేజీ ప్రాజెక్ట్ తో సిద్ధం అవుతున్న మాటల మాంత్రికుడు

టాలీవుడ్‌లో మల్టీస్టారర్‌ సినిమాల జోరు కొనసాగుతున్న నేపథ్యంలో మరిన్ని మల్టీస్టారర్‌లు వచ్చేందుకు సిద్దం అవుతున్నాయి. తాజాగా నాగార్జున,నాని కాంబినేషన్ లో వచ్చిన ‘దేవదాసు’ సినిమా పాజిటివ్ టాక్ తో ముందుకు సాగుతుంది. మరో వైపు రాజమౌళి రికార్డు స్థాయి బడ్జెట్‌తో రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ల కాంబినేషన్ లో సినిమా తీస్తున్నాడు. ఇలాంటి సమయంలో మరో మల్టీస్టారర్‌ వార్త సినీ వర్గాల వారితో సహా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది.

ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో అరవింద సమేత సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో సినిమా చేస్తాడని, కాదు వెంకటేష్ తో సినిమా చేస్తాడని వీరిద్దరి అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో సినీ వర్గాల నుండి ఆసక్తికర పుకారు ఒకటి బయలుజేరింది.

అల్లు అర్జున్‌ మరియు వెంకటేష్‌ల కలయికలో త్రివిక్రమ్‌ ఒక మల్టీస్టారర్‌ చిత్రాన్ని చేసేందుకు సిద్దం అవుతున్నాడట. భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న ఈ చిత్రం షూటింగ్‌ వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం కాబోతుందనే టాక్‌ కూడా వినిపిస్తుంది.

టాలీవుడ్‌లో మల్టీస్టారర్‌ చిత్రాల జోరు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ వార్తలను అంతా నమ్ముతున్నారు. ఈ వార్తలు నిజం కావాలని అంతా కోరుకుంటున్నారు. ఒక వేళ ఈమల్టీస్టారర్‌ నిజమే అయితే ప్రేక్షకులకు పండుగే పండుగ.