స్టార్ మాలో మరో భారీ రియాల్టీ షో ? వివరాలు మీ కోసమే…. మిస్ కాకండి

విదేశాలనుంచి ఉత్తరాదికి పాకిన రియాల్టీ షోలు తెలుగులో బుల్లితెరపై క్లిక్ అవుతాయా లేదా అనే అనుమానాన్ని బిగ్ బాస్ సీజన్1,2లు పటాపంచలు చేశాయి. భారీ రేటింగ్స్ ని సాధించి స్టార్ మా నెంబర్ స్థానంలో నిలించింది. ఇప్పుడు ఇలాంటిదే మరో రియాల్టీ షోకి ప్లాన్ చేశారట. విల్లా టు విలేజ్ పేరుతో ఈ షో రన్ చేస్తారట. నిజానికి ఉత్తరాదిన విజయంతంగా సాగిన కౌన్ బనేగా కరోడ్ పతి తరహాలో మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాం తో సక్సెస్ అయినా స్టార్ మా ఆతరవాత ధైర్యంగా బిగ్ బాస్ కి తెలుగులో శ్రీకారం చుట్టింది. జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా బిగ్ బాస్ సీజన్ వన్ అదిరిపోయే లెవెల్లో సాగితే,నాని హోస్ట్ గా సీజన్ టు కూడా టిఆర్పి రేటింగ్స్ ని పీకి స్టేజ్ కి తీసుకెళ్లాయి.

ఇక టివి సీరియల్స్ తో కూడా స్టార్ మా ఎంటర్ టైన్ మెంట్ లో దుమ్మురేపుతోంది. సినిమా , టివి స్టార్స్ తో ఇంటర్యూలు,స్టార్స్ ని భాగస్వామ్యం చేసే ప్రోగ్రామ్స్,వంటలు,వార్పులు,చిన్న చిన్న పోటీలు,పిల్లల కార్యక్రమాలు ఇలా ఎన్నిచేసినా రాని రేటింగ్స్ ఇతర భాషల్లో సాగే రియాల్టీ షోలను తెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే బిగ్ బాస్ క్లిక్ అయింది.

ఇక హిందీలో క్లిక్ అయిన కపిల్ కామెడీ టైప్ షోను తెలుగులో బ్రహ్మానందంతో తీసుకొస్తున్నారు. దీనికి బిగ్ బాస్ ఫేమ్ తేజస్వి యాంకర్. ఇప్పుడు ఇతర భాషల్లో స్టార్ట్ ఐన రియాల్టీ షోని విల్లా టు విలేజ్ పేరిట ఇంటర్ డ్యూస్ చేయబోతోంది. విదేశీ ఛానల్స్ లో లవ్ ఐలాండ్ వంటి రియాల్టీ షోలకు అనుగుణంగా విల్లాటు విలేజ్ రియాల్టీ షో డిజైన్ చేసియున్నారట. సిటీ లైఫ్ కి బాగా కనెక్ట్ అయిన సెలబ్రిటీలను తీసుకెళ్లి మారుమూల పల్లెల్లో పడేస్తారు.

పల్లె జీవనాన్ని ఎంజాయ్ చేస్తూ,అక్కడి కష్ఠాలను కూడా భరించాలి. చేతిలో డబ్బుండదు. తమ పనులు తామే చేసుకుంటూ డబ్బు సంపాదించుకోవాలి. పల్లె వాతావరణానికి అనుగుణంగా టాస్క్ లు,వారంవారం ఊరి జనం వేసే ఓట్లు, చెప్పే తీర్పులు,ఇలా విభిన్నంగా షో నడుస్తుంది.

ఇక దీనికి పూర్తి రివర్స్ లో మారుమూల గ్రామాల్లోని వ్యక్తులను తీసుకొచ్చి,విల్లాలో పడేసి,సిటీ లైఫ్ కి సంబంధించిన టాస్క్ లు, పోటీలు, కష్ఠాలు అన్నీ ఉంటాయి. బిగ్ బాస్ సీజన్ టు ముగిశాక భారీగా ఈ కొత్త రియాల్టీ షో తెరమీదికి రానుందని అంటున్నారు.