సైరాలో టీం ఇండియా కోచ్ తమ్ముడు…. మన అందరికి తెలిసిన టాప్ హీరో…ఎవరో చూడండి

ఒకప్పుడు మెరుపులా సినీ ఇండస్ట్రీకి వచ్చి, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో నటించి తన మార్కు ఇమేజ్‌ను నటుడు ఆనంద్‌ సొంతం చేసుకున్నాడు. హీరోగానే కాదు.. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గానూ మెప్పించి జనాదరణ పొందాడు. తెలుగులో దాదాపు 30కు పైగా సినిమాల్లో నటించిన ఆనంద్ 1993లో మణిరత్నం డైరెక్షన్ లో దొంగ దొంగ చిత్రంలో హీరో ప్రశాంత్ తో కల్సి ప్రధాన పాత్రలో నటించాడు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా సినిమాలో ఆనంద్ కి కీలక పాత్ర లభించడం అతని కెరీర్ మలుపు తిరుగుతుందని భావిస్తున్నారు. టీమ్ ఇండియా బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ కి ఆనంద్ తమ్ముడు. వీళ్ళ సొంతూరు విజయవాడ. ఇతని తండ్రి విఎస్ భరత్ బ్రూక్ బ్రాండ్ ఇండియాలో పనిచేసాడు. తల్లి రాజ్యలక్ష్మి హౌస్ వైఫ్.

అసలు భారత్ క్రికెట్ జట్టుకి ఒకప్పటి క్రికెటర్ రవిశాస్త్రి ప్రధాన కోచ్ గా ఉంటున్నాడు. ఇక తనకు నచ్చినవాళ్లను అసిస్టెంట్ కోచ్ లుగా సెలక్ట్ చేసుకునే వెసులుబాటు కోచ్ లకు ఉంటుందని వేరే చెప్పక్కర్లదు. అదే విధంగా రవిశాస్త్రి తనకు అంత్యంత సన్నిహితుడైన భరత్ అరుణ్ ని అసిస్టెంట్ కోచ్ గా నియమించాడు. ఇతని కోచింగ్ లో భారత బౌలర్లు మేటి క్రికెటర్లుగా మలచబడ్డారు.

భువనేశ్వర్ కుమార్,బుమ్రా,షమీ,ఉమేష్ యాదవ్ ఇలా ఎంతోమంది వరల్డ్ క్లాస్ బౌలర్లుగా పేరు తెచ్చుకున్నారంటే,దానికి భరత్ అరుణ్ ఇచ్చిన శిక్షణ ప్రధాన కారణం. భరత్ అరుణ్ కి సినీ హీరో ఆనంద్ తమ్ముడనే విషయం చాలామందికి తెలీదు. నలుగురు అన్నదమ్ముల్లో ఆనంద్ చివరి వాడు. పెద్దన్నయ్య రమేష్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాడు.

రెండో అన్నయ్య డాక్టర్ సురేష్ వివేకానంద కాలేజీలో ఇంగ్లీషు లెక్చరర్ గా పనిచేస్తున్నారు. మూడో అన్నయ్య భరత్ అరుణ్ టీమ్ ఇండియా అసిస్టెంట్ కోచ్ గా ఉన్న సంగతి తెల్సిందే. ఇక ఆనంద్ 1987లో వెండితెరకు పరిచయం అయ్యాడు. తెలుగులో ఆలీతో కల్సి కాలేజ్ స్తూడెంట్ అనే మూవీలో నటించిన అమృత అనే సినీ హీరోయిన్ ని ఆనంద్ పెళ్లాడాడు.

అయితే దొంగ దొంగ మూవీ తెలుగులో డబ్ చేయడంతో తెలుగునాట ఆనంద్ ఎవరో తెల్సింది. ఆ తర్వాత ఆంటీ , అమ్మాయి కాపురం,మెరుపు, శ్రీకారం,అక్కా బావున్నావా,అమ్మా నాన్న కావాలి,పెళ్ళాల రాజ్యం,స్నేహితులు వంటి మూవీస్ నటించడం ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. తెలుగులో హీరోగా వెలగకపోయినా, తమిళంలో ఓ రేంజ్ లో ఉన్నాడు.

ఇక దక్షిణాది భాషల్లో తన డిమాండ్ పెంచుకుంటున్నాడు. తెలుగులో లాహిరి లాహిరి లాహిరి సీరియల్ లో కూడా నటిస్తున్నాడు. ప్రస్తుతం భార్యతో కల్సి తిరువనంతపురంలో నివాసం ఉంటున్న ఆనంద్ కి జింజరో రెస్టారెంట్ కూడా ఉందట. మరి సైరా సినిమా ఆనంద్ ని పీక్ స్టేజ్ కి తీసుకెళుతుందేమో చూడాలి.