గీతా మాధురి బిగ్ బాస్ టైటిల్ కి దూరమవ్వడానికి 10 కారణాలు ఇవే.!

మూడు నెలల పాటు మనందరినీ ఎంటర్టైన్ చేసిన బిగ్ బాస్ రెండో సీజన్ ముగిసింది. అందరు అనుకున్నట్టుగానే కౌశల్ విన్నర్ గా నిలిచారు. గీత మాధురి రన్నర్ అప్ గా రెండో స్థానం సంపాదించుకున్నారు. షో మొదలైనప్పటి నుండి హౌస్ లో గీత మాధురిపై మంచి అభిప్రాయమే ఉంది అందరికి. ఒకానొక సందర్భంలో ఆమె టైటిల్ కొడుతోంది అని కూడా అనుకున్నారు అభిమానులు . కానీ ఒక్కసారిగా డౌన్ కావడానికి ప్రధానంగా కౌశల్‌తో వైరమే కారణం.

1. మొదట్లో కౌశల్‌పై భాను శ్రీ వ్యవహారంలో అందరూ మూకుమ్మడి దాడి చేస్తుంటే.. అతనికి అండగా నిలిచింది గీత. అయితే భాను శ్రీని తాకరాని చోట తాకాడని తేజస్వి, భాను శ్రీలు చేసిన ఆరోపణల్ని ఖండించింది.

2. తర్వాత కౌశల్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా మారుతుండటంతో అతనితో వైరం పెట్టుకుంది.పదే పదే కౌశల్‌ గురించి మిగిలిన హౌస్‌ మేట్స్ వద్ద చర్చిస్తూ.. గొడవలకు ఆద్యం పోసింది.

3. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్‌లలో పెర్ఫామెన్స్ పరంగా కూడా బెటర్మెంట్ లేకపోవడం, టైటిల్ నాదే అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ ఈమెకు ఉన్న ప్రధాన మైనస్.

4.బిగ్ బాస్ వరంలా ఇచ్చిన సీక్రెట్ టాస్క్‌ను విజయవంతంగా పూర్తి చేసి కౌశల్‌ను సీజన్ మొత్తం ఎలిమినేషన్‌లోకి నెట్టింది. దీంతో కౌశల్‌కి ప్రేక్షకుల్లో బాగా సింపతీ పెరిగింది.

5.‘మీకసలు అర్ధమౌతోందా.. అది వాళ్ల గేమ్ ఏమో.. ఇలా అయ్యిండొచ్చెమో.. ఇలానే అవ్వాలని రూల్ లేదు కదా.. లాంటి డైలాగ్స్‌తో ప్రేక్షులతో పాటు కంటెస్టెంట్స్‌ను తన నసతో ఇబ్బంది పెట్టేది గీతా మాధురి.

6. ఒక అమ్మాయి అబ్బాయి కళ్లల్లో కళ్లు పెట్టుకుని చేతిలో చేయి వేసుకుని అదే పనిగా చూస్తూ ఉంటుంటే.. బ్యాగ్రౌండ్‌లో ‘కళ్లు కళ్లు ప్లస్సూ వాళ్లు వీళ్లు మైనస్ ఒళ్లు ఒళ్లు ఇన్‌టు చేసేటి ఈక్వేషన్’ అంటూ రొమాంటిక్ సాంగ్ ప్లే అవుతుంటే.. ఆ సీన్ చూసిన ప్రేక్షకులు వీళ్లది అన్నా చెల్లెల్ల రిలేషన్ అని మాత్రమే అనుకోవాలంటే అది గీతకు చెల్లుతుందేమో సో సామ్రాట్ తో రిలేషన్ గీత కొంపముంచింది.

7. పదే పదే సామ్రాట్ తో రిలేషన్ గురించి ప్రస్తావించి మరికొంత నెగటివిటీ మూటకట్టుకుంది గీత. ఇక దీనికి తోడు భర్త నందు వచ్చినప్పుడు చేసిన ఓవర్ ఆక్షన్ తక్కువేం కాదు.

8. గీత భర్త నందు సోషల్ మీడియా ద్వారా గీత ఫాలోయింగ్ పెంచడానికి ట్రై చేసారు కానీ కౌశల్ ఆర్మీ ముందు అది ఏ మాత్రం సరిపోలేదు.

9. అంతే కాకుండా ప్రేక్షకులు ఏమి అనుకుంటే మనకు అనవసరం మనం కరెక్ట్‌గా ఉన్నామా లేదా అన్నది మనకు మాత్రమే తెలుసు, వాళ్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ దీప్తితో చర్చలో భాగంగా మాట్లాడటం ఆమెను టైటిల్‌కి దూరం చేశాయి.

10. సామ్రాట్‌తో కొంటె చూపులు, కవ్వింపులు, లిప్ స్టిక్ చర్చలు, హగ్ ప్రాక్టీస్‌లు చేసిన గీతా మాధురి.. తప్పంతా నాదేం కాదు.. చూసిన ప్రేక్షకులదే.. చూపించిన బిగ్ బాస్‌దే అని కవర్ చేసుకునే ప్రయత్నంలో కొత్త రిలేషన్స్‌ని తెరపైకి తీసుకువచ్చింది.