కౌశల్ బిగ్ బాస్ లో గెలుచుకున్న 50 లక్షలు ఎవరికీ ఇచ్చాడో తెలుసా? రియల్ హీరో అనిపించుకున్నాడు

అందరూ అనుకున్నట్టే బిగ్ బాస్ లో కౌశల్ విన్నర్ అయ్యాడు. ఇక బిగ్ బాస్ చరిత్రలో ఏ భాష లోనూ రాని ఓట్లు కౌశల్ కి వచ్చిపడడంతో స్టార్ మా యాజమాన్యం కూడా దిగ్బ్రాంతికి గురైంది. స్టార్ మా టివిలో సంచలనం సృస్తిస్తూ సాగిన బిగ్ బాస్ సీజన్ 2 కి కోట్లాదిమంది కనెక్ట్ అవుతూ, కురిపించిన ఓట్ల వర్షంతో ఈ రియాల్టీ షో గ్రాండ్ సక్సెస్ తో ముగిసింది. ఎవరూ ఊహించని విధంగా పాపులారిటీ సంపాదించుకుని,లక్షలాది అభిమానుల హృదయాలను గెలుచుకున్న కౌశల్ కి 112రోజుల కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింది. అందుకే తనని విన్నర్ గా ప్రకటించి హోస్ట్ నాని ట్రోఫీ అందిస్తున్నప్పుడు కౌశల్ ముఖంలో ఆనందంతో వెలిగిపోయింది. ఇక వేదిక మీదకు వచ్చిన విక్టరీ వెంకటేష్ కాళ్లకు కౌశల్ నమస్కరించాడు. వెంకీ కూడా కౌశల్ ని ఆలింగనం చేసుకున్నాడు.

తనకోసం శ్రమించిన కౌశల్ ఆర్మీకి,అభిమానులకు,కుటుంబ సభ్యులకు ఈ విజయాన్ని అంకితం ఇస్తున్నట్లు కౌశల్ ప్రకటించాడు. ట్రోఫీ తీసుకుంటున్న సమయంలో కౌశల్ ఆనంద భాష్పాలు రాల్చాడు. ఇక టివిలో ప్రోగ్రాం వీక్షిస్తూ కౌశల్ భార్య భావోద్వేగానికి గురయ్యారు. ‘లక్షలాది మంది అభుమానుల ఆకాంక్ష,నా కుటుంబ సభ్యుల ప్రార్ధనలు ఫలించాయి. ఈ విజయం మీ అందరిదీ, ఇన్నాళ్లూ పడిన కష్టం ఈ విజయంతో మాయం అయింది.

ఒక మనిషి ఎన్ని బాధలు తట్టుకుని నిలబడగలడో బిగ్ బాస్ షో నిరూపిస్తుంది. ఈ పరీక్షలో నూటికి నూరుశాతం గెలిచానని అనుకుంటున్నాను. నాకు వెన్ను దన్నుగా నిల్చి నిలబెట్టిన అభిమానులకు ఏమిచ్చి ఋణం తీర్చుకోగలను’ అంటూ కౌశల్ ఎమోషనల్ అయ్యాడు.
కౌశల్ అంటే అభిమానులు, అభిమానుల ప్రతిరూపమే కౌశల్ అన్నట్టుగా ఉందని కౌశల్ పేర్కొన్నాడు. ఎన్నివేల కృతజ్ఞతలు చెప్పినా అభిమానుల ఋణం తీరానిదన్నారు.

‘బిగ్ బాస్ హౌస్ లోకి జీరోతో అడుగు పెట్టాను. అయితే ఇతర కంటెస్టెంట్స్ నాలో కసిని పెంచారు. అందుకే పట్టుదలగా స్టెప్ పై స్టెప్ ఎదిగాను. నా విజయాన్ని అభిమానులకు అంకితం ఇచ్చేసాను. ఇక నాకు వచ్చిన ప్రయిజ్ మనీని కాన్సర్ తో బాధపడే మహిళల కోసం వినియోగిస్తాను’అంటూ భావోద్వేగాల నడుమ కౌశల్ ప్రకటించాడు. ఇలా ఉద్వేగాల మాట్లాడిన కౌశల్ ఎవరినీ తూలనాడకుండా హుందాతనం కొనసాగించాడు.