మిస్టర్ ఇండియా కాంటెస్ట్ నుండి బిగ్ బాస్ 2 దాకా కౌశల్ ప్రస్థానం

స్టార్ మా ఛానల్ లో 113రోజుల పాటు సాగిన బిగ్ బాస్ సీజన్ 2రియాల్టీ షోలో విన్నర్ గా నిల్చిన కౌశల్ ఈ గెలుపు వెనుక ఎంతో కష్టం దాగుంది. బిగ్ బాస్ హౌస్ లో అందరినీ ఎదుర్కొని టైటిల్ గెల్చిన కౌశల్ కి గాయని గీతా మాధురి గట్టిపోటీ ఇచ్చింది. అయితే ఆమె రన్నర్ అప్ గా ఆగిపోయింది. గ్రాండ్ ఫైనాలి సందర్బంగా హౌస్ లో గల 5గురిలో ముందుగా సామ్రాట్, దీప్తిలను ఆతర్వాత తనీష్ ని ఎలిమినేట్ చేసాక,విక్టరీ వెంకటేష్ ఎంట్రీ ఇచ్చి, కౌశల్ ని విన్నర్ గా ప్రకటించి టైటిల్ అందజేశారు. 50లక్షలు ప్రయిజ్, మనీ, ట్రోఫీ అందజేశారు.

బిగ్ బాస్ హౌస్ లో ప్రయాణం ఎలా సాగిందో ఓసారి మననం చేసుకుంటే,హౌస్ లో కంటెస్టెంట్స్ అందరూ కౌశల్ కి వ్యతిరేకంగా మారడంతో, బయట అభిమానుల ఫాలోయింగ్ మొదలైంది. అది కాస్తా సోషల్ మీడియా వేదికగా కౌశల్ ఆర్మీగా రూపాంతరం చెందింది. అలాగే కౌశల్ నటించిన సూర్యవంశం,చక్రవారం సీరియల్స్ లోని యాక్టర్స్ కూడా సోషల్ మీడియా వేదికగా మద్దతు ప్రకటిస్తూ, వీడియోలు పోస్ట్ చేసారు. తనని టార్గెట్ చేస్తున్నా సరే, కౌశల్ చివరివరకూ హుందాతనం కొనసాగించాడు.

భారీగా ఓటింగ్ రావడానికి కౌశల్ ఆర్మీ ఇచ్చిన సపోర్ట్ కారణం.ఇక కౌశల్ పర్సనల్ లైఫ్ లోకి వెళ్తే,1981లో విశాఖలో కౌశల్ జన్మించాడు. తండ్రి నటుడు కావడంతో తాను కూడా యాక్టింగ్ పై దృష్టి సారించాడు. మోడలింగ్, సీరియల్స్ , సినిమాలు ఇలా అన్ని రంగాలలో తన ఇమేజ్ చూపించాడు. 1999లో మోడలింగ్ ఏజన్సీని లుక్స్ పేరిట స్టార్ట్ చేసాడు. ఇది సౌత్ ఇండియాలోనే మొదటిది. అదే ఏడాది మిస్టర్ ఇండియా పోటీలకు వెళ్లిన కౌశల్ ఆతర్వాత రాజకుమారుడు మూవీతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.

ఇక బిగ్ బాస్ లో వచ్చిన ప్రయిజ్, మనీ అందుకున్న వెంటనే,కౌశల్ తన తల్లి కాన్సర్ వలన చనిపోయినందున కాన్సర్ బారిన పడ్డ ఫ్యామిలీస్ కి ఈ సొమ్ము వెచ్చిస్తానని తన ఉదారత చాటాడు. అయితే కౌశల్ కి ఇది కొత్తకాదు. గతంలో విశాఖలో వచ్చిన హుదూద్ తుపాన్ లో బాధితులకు తన పర్సనల్ ఎక్కౌంట్ లో దాచుకున్న 12లక్షలను వెచ్చించి ఆదుకున్నాడు. విభిన్న కోణాలు గల కౌశల్ కి బిగ్ బాస్ టైటిల్ రావడం సమంజసమేనని అందరూ అంటున్నారు.