కరీనా కొడుకుని చూసుకునే ఆయాకు ఇచ్చేందేంతో తెలిస్తే షాకవ్వాల్సిందే

ఒకప్పుడు హీరోయిన్స్ కి ఇప్పటికీ ట్రెండ్ లో చాలా పెద్ద మార్పు వచ్చేసింది. వేసినన్నాళ్లు హీరోయిన్ గా వేసేసి, మెల్లిగా పెళ్ళిచేసుకుని సెటిలయ్యేవారు. ఆతర్వాత కొన్నాళ్ళకు రీ ఎంట్రీ ఇచ్చినా అమ్మ పాత్రలో,అక్క పాత్రలో , అత్తపాత్రలో వేయాల్సిందే. కానీ దానికి ఇప్పు చెల్లుచీటి ఇచ్చేస్తున్నారు హీరోయిన్స్. బాలీవుడ్ లో కరీనా కపూర్,ఐశ్వర్య రాయ్ వంటి వాళ్ళు పెళ్లయ్యేక పిల్లల్ని కన్నాక కూడా కుర్ర హీరోయిన్స్ కి ధీటుగా రాణిస్తున్నారు. చివరకి లిప్ లాక్ సీన్స్ కి సైతం ఒకే చెప్పేస్తూ తమ అందాల ఆరబోతలో తమకు తామే సాటి అనిపించుకుంటున్నారు.

ముఖ్యంగా కరీనా కపూర్ విషయం తీసుకుంటే,అప్పటికే పెళ్లయిన హీరో సైఫ్ ని పెళ్లాడింది. సైఫ్ కి అంతకుముందు హీరోయిన్ అమృతా సింగ్ తో పెళ్లవ్వడం,సంతానం కూడా వారికి కల్గింది. అయితే కరీనాను చూసిన సైఫ్ ఆమెతో ప్రేమలో పడి,భార్యకు విడాకులిచ్చేసాడు. కరీనాను పెళ్లాడాక ఇద్దరికీ ఓ బాబు పుట్టాడు. అతడికి తైమూర్ అనే పేరు పెట్టారు. ఈ బాబు గురించి ఏ చిన్న విషయమైనా సరే,సోషల్ మీడియాలో పంచుకోవడంలో కరీనా, సైఫ్ పోటీ పడుతుంటారు.

ఇక కరీనా,సైఫ్ ఇద్దరు సినిమాల్లో బిజీ కనుక బాబుని చూసుకోడానికి ఓ ఆయాను నియమించారు. ఈమెకు నెలకు ఇచ్చేదెంతో తెలిస్తే నిజంగా షాక్ కి గురవుతాం. అవును అక్షరాలా లక్ష రూపాయలు ఇస్తారు. ఇదికాక ఓవర్ టైం చేస్తే,మరో 25వేలు ముట్టజెప్పాల్సిందే . ఇక ఆమెను తీసుకొచ్చి,తీసుకెళ్లడానికి లగ్జరీ కారు కూడా ఎరేంజ్ చేసారు. ఎంతోమంది ఆయాలను ఇంటర్యూ చేసాక ఇప్పుడున్న ఆయాను కరీనా,సైఫ్ సెలెక్ట్ చేసుకున్నారట. ఇక ఫారిన్ టూర్ వెళ్లినా సరే, ఆయా వంట ఉండాల్సిందేనట.