గీతా మాధురి ఓటమితో నందు సంచలన కామెంట్స్

బుల్లితెరపై 18మంది కంటెస్టెంట్స్ తో మొదలైన బిగ్ బాస్ సీజన్ 2 110రోజులకు పైనే నడించింది. హీరో నాని హోస్ట్ గా మొదలైన బిగ్ బాస్ టు రియాల్టీ షో లో ఆయా ఎపిసోడ్స్ లో ఎలిమినేషన్ కాగా చివరికి ఐదుగురు కంటెస్టెంట్స్ అంటే కౌశల్,తనీష్, గీతా మాధురి,దీప్తి నల్లమోతు ,సామ్రాట్ గ్రాండ్ ఫినాలేలో మిగిలారు. వీరి మధ్య హోరాహోరీగా పోరు నడించింది. ఎవరిది విజయం అనే విషయంపై వారం రోజులపాటు టెన్షన్ నడిచింది. అయితే అందరి అంచనాలకు తగ్గట్టుగా కౌశల్ విన్నర్ అయ్యాడు. కౌశల్ ఆర్మీ పోరాటం సఫలమైంది. కౌశల్ తో తనీష్,గీతా మాధురి,దీప్తి నల్లమోతు కూడా గట్టిగానే పోరాడారు.

అయితే కౌశల్ పై గీతా మాధురి భర్త నందు చేసిన హాట్ కామెంట్స్ చర్చనీయం అయ్యాయి. అయితే బిగ్ బాస్ చరిత్రలో ఎక్కువ సార్లు ఎలిమినేషన్స్ కి నామినేట్ అయికూడా అందరికన్నా ఎక్కువా అందునా అత్యధిక ఓట్లు సాధించి టైటిల్ విన్నర్ గా కౌశల్ చరిత్ర సృష్టించాడు. ఎలిమినేషన్ అయినప్రతిసారి కూడా ఎక్కువ ఓట్లను సాధిస్తూ,ఇక గ్రాండ్ ఫినాలేలో ఓట్ల వర్షం కురవడంతో తన విశ్వరూపం చూపించాడు.

కౌశల్ ఆర్మీ అండతో మిగతా కంటెస్టెంట్స్ దరిదాపుల్లోకి రానంతగా ఓట్లు సాధించి బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అయ్యాడు. అయితే చివరివరకూ నువ్వా నేనా అనే రీతిలో గీతా మాధురి పోటీపడ్డారు. ఇంతా చేస్తే ఏం లాభం కౌశల్ ప్రభంజనం ముందు సింగర్ గీతా నిలువలేక వెనకబడింది. అయితే సీజన్ మొత్తం గీతా ఆడిన అద్భుతమని, ముఖ్యంగా మహిళ అయివుండి అన్ని టాస్క్ లలో హోరాహోరీగా డడం గొప్ప విషయమని అందరూ అంటున్నారు.

ఇక ఇది విషయాన్ని గీతా మాధురి భర్త ప్రస్తావిస్తూ,’గీతా ఓడిపోయిందన్న బాధ లేదు. ఆమె ఈ 100రోజులు ఎంతబాగా ఫెరఫార్మెన్స్ ఇచ్చిందో, అందరితో ఎలా కలివిడిగా ఉందో అందరూ చూసారు. ఆమె అందరినీ గెలుచుకుంది’అని పేర్కొన్నాడు. ఇక విన్నర్ ప్రకటన తీరుపై కూడా ఎలాంటి అభ్యంతరాలు లేవని స్పష్టం చేసాడు. కౌశల్ టైటిల్ విన్నర్ కి అర్హుడని ఓపెన్ గా ప్రకటించి కౌశల్ ని మెచ్చుకోవడం నిజంగా హాట్ కామెంట్స్ అయ్యాయి.