బిగ్ బాస్ 2 విన్నర్ కౌశల్ కి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన యంగ్ టైగర్… అది ఏమిటో?

హమ్మయ్య ఉత్కంఠకు తెరపడింది. స్టార్ మా యాజమాన్యం నిర్వహణలో బుల్లితెరపై దాదాపు 110 రోజులకు పైనే నడిచిన బిగ్ బాస్ సీజన్ 2లో అందరి అంచనాలకు తగ్గట్టుగా కౌశల్ విన్నర్ అయ్యాడు. కౌశల్ ఆర్మీ పోరాటం ఫలించింది. మొత్తం 18 మంది కంటెస్టెంట్స్ తో హీరో నాని హోస్ట్ గా మొదలైన బిగ్ బాస్ టు రియాల్టీ షో లో ఆయా ఎపిసోడ్స్ లో ఎలిమినేషన్ కాగా చివరికి ఐదుగురు కంటెస్టెంట్స్ మిగిలిన సంగతి తెల్సిందే. కౌశల్,తనీష్, గీతా మాధురి,దీప్తి నల్లమోతు ,సామ్రాట్ ల నడుమ హోరాహోరీగా పోరు నడించింది.

బిగ్ బాస్ చరిత్రలో ఎక్కువ సార్లు ఎలిమినేషన్స్ కి నామినేట్ అయికూడా అత్యధిక ఓట్లు సాధించి విజేతగా నిలవడం ద్వారా కౌశల్ చరిత్ర సృష్టించాడు. నువ్వా నేనా అనే రీతిలో పోటీపడిన గీతా మాధురి కూడా వెనుకబడిపోయింది. ఎలిమినేషన్ అయిన ప్రతిసారి కూడా ఎక్కువ ఓట్లను సాధిస్తూ,ఇక గ్రాండ్ ఫినాలేలో తన విశ్వరూపం చూపించాడు.

కౌశల్ ఆర్మీ అండతో మిగతా కంటెస్టెంట్స్ దరిదాపుల్లోకి రానంతగా ఓట్లు సాధించి బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గా నిలిచాడు. ఇక కౌశల్ కి వచ్చిన ఓట్లు చూసి బిగ్ బాస్ నాని ఆశ్చర్యపోయాడంటే ఏ రేంజ్ లో కౌశల్ ఆర్మీ తనసత్తా చాటిందో చెప్పక్కర్లేదు.అయితే తనీష్,గీతా, దీప్తి కూడా హోరాహోరీగానే పోరాడి తామేంటో నిరూపించుకున్నారు. విన్నర్ గా నిలవడంతో కౌశల్ తో పాటు,కౌశల్ ఆర్మీ ఆనందం లో మునిగిపోయారు. ఇక సినీ సెలబ్రిటీలు కూడా అభినందనల వర్షం కురిపిస్తున్నారు.

ఎంతమంది సినీ సెలబ్రిటీలున్నా తారక్ రూటే వేరు కదా. బిగ్ బాస్ షో తో గల అనుబంధం కారణంగా విన్నర్ కౌశల్ కి తారక్ ఓ సర్ ఫ్రీజ్ గిఫ్ట్ పంపాడట. అరవింద సమేత మూవీ హడావిడిలో బిజీగా గల తారక్ తనకోసం స్పెషల్ గిఫ్ట్ పంపడంతో కౌశల్ ఆనందానికి అవధుల్లేవు.