బిగ్ బాస్ హౌస్ నుండి కూతురికి అదిరిపోయే గిఫ్ట్ తెచ్చిన కౌశల్

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 2లో ప్రత్యర్థులను సింగిల్ హ్యాండ్ తో ఎదుర్కొని, టైటిల్ గెల్చుకొని అసాధారణంగా అభిమానులను సైతం సొంతం చేసుకున్న ఘనత కౌశల్ దే. అందుకే తెలుగు రాష్ట్రాల్లోనే కాదు,ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు కూడా కౌశల్ వైపు మొగ్గుచూపారు. ఇంకా కౌశల్ పేరు మారుమోగుతూనే ఉంది. కంటెస్టెంట్స్ అందరూ ఒక్కటైనా సరే, తట్టుకుని టైటిల్ గెల్చిన ఘనత ఏ భాషలోనూ లేదు. అది కౌశల్ కే సాధ్యమైంది. తనకు టైటిల్ వచ్చింది, లల్లీ కి బొమ్మ వచ్చింది అంటూ కూతురికి ఇచ్చిన గిఫ్ట్ గురించి చెబుతూ కౌశల్ తన ఆనందనాన్ని షేర్ చేసుకున్నాడు.

దాదాపు 113 రోజులు హౌస్ లో అలసిపోయిన కౌశల్ ప్రస్తుతం విన్నర్ గా ఇంటికి చేరి, సేదదీరుతున్నాడు. ఫామిలీ తో ఇన్నాళ్లూ కోల్పోయిన ఆనందాన్ని మళ్ళీ ఆస్వాదిస్తున్నాడు. మరీ ముఖ్యంగా తల్లి మరణం తర్వాత తన చిన్నకూతురు లల్లీ లోనే తల్లిని చూసుకుంటున్న కౌశల్ ఇప్పుడు ఇంట్లో ఎక్కువ సమయం కూతురితోనే గడుపుతున్నాడట. ఇన్నాళ్లూ కుమార్తెను వదిలి వుండలేకపోయాయని, అందుకే హౌస్ నుంచి వచ్చేటప్పుడు ఓ బొమ్మ తయారు చేసి తెచ్చి ఇచ్చానని కౌశల్ అంటున్నాడు.

ఓ పుట్టినరోజు కేక్ లో వచ్చిన బొమ్మకి కొన్ని హంగులు సమకూర్చి చూడముచ్చటగా బొమ్మను తయారుచేసి, హౌస్ లో ఉన్నరోజుల్లో ఆ బొమ్మలోనే తన కూతురు చూసి మురిసిపోతూ ఉండేవాడినని, ప్రతిరోజూ పడుకునే ముందు పక్కలో ఈ బొమ్మను చూస్తూ లల్లీ పక్కనే ఉన్నట్లు ఫీలయ్యేవాడినని, ఈ బొమ్మే తనకు హౌస్ లో నేస్తంగా ఉండేదని, కౌశల్ తన అభిమానులకు వివరించాడు. అందుకే హౌస్ నుంచి వచ్చేటప్పుడు ఆ బొమ్మను కూడా తీసుకొచ్చినట్లు చెప్పుకొచ్చాడు. లల్లీకి ఈ బొమ్మను గిఫ్ట్ గా ఇస్తున్నట్లు చెప్పాడు.