కౌశల్ గెలుపుపై ఎన్నో అనుమానాలు ఉన్నాయి అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన బాబు గోగినేని

బిగ్ బాస్ సీజన్ 2 రియాల్టీ షోలో విన్నర్ గా నిలిచిన కౌశల్ కి దాదాపు 39కోట్ల ఓట్లు వచ్చాయట. అయితే కౌశల్ ని విన్నర్ గా ప్రకటించి ఒక రోజు అయిందో లేదో అప్పుడే వివాదాలు చుట్టుముడుతున్నాయి. కొందరు చేస్తున్న వ్యాఖ్యలు కూడా వివాదమవుతున్నాయి. ఇక కౌశల్ కి దాదాపు 39కోట్ల ఓట్లు రావడం వెనుక పక్కాగా ఓ ప్రణాళిక నడిచినట్లు తెలుస్తోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. తెలుగు,మలయాళ,తమిళ బుల్లితెర నుంచి కూడా ఆడియన్స్ ఓట్లు పడ్డాయని అంటున్నారు.

తెలుగులో కౌశల్ ఆర్మీ మాదిరిగానే తమిళంలో రిత్విక ఆర్మీ,మలయాళంలో నబూ ఆర్మీ ఏర్పడ్డాయట. ఈ మూడు భాషల ఆర్మీల కారణంగానే బిగ్ బాస్ విజేతలు నిర్ణయించబడ్డారని అంటున్నారు. మిగతా భాషల ఆర్మీల మద్దతు సంపాదించడంతో కౌశల్ ఆర్మీ చేసిన కృషి ఫలించిందని అంటున్నారు. నెమ్మదిగా మొదలైన కౌశల్ ఆర్మీ ఆ తర్వాత విస్తృతంగా విస్తరించిందని,తమిళంలో రిత్విక,మలయాళంలో నబు ఆర్మీ ఇలా పరస్పర సహకారంతో విన్నింగ్ ఛాన్స్ దక్కించుకున్నట్లు వినిపిస్తోంది.

బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాక, తనకు విరక్తి కల్గిందని షాకింగ్ కామెంట్స్ చేసారు. తనవద్ద గల పక్కా సమాచారం మేరకు 3500డాలర్స్ పెడితే అమెరికాలో 10వేల ఈమెయిల్స్ క్రియేట్ అవుతాయని అన్నారు. ఆ సొమ్ము కడితే, వాళ్ళే మెయిల్స్ క్రియేట్ చేసి ఓట్లు వేయించి పెడతారని బాబు అన్నారు. నిజానికి రియాల్టీ షో కాకుండా సైబర్ వార్ గా మారిపోయిందని బాబు సంచలన వ్యాఖ్యలు చేసారు.