బిగ్ బాస్ రన్నరప్ లో దీప్తి కి అన్యాయం చేశారా? దీనిలో ఎంత నిజం ఉందో?

హీరో నాని హోస్ట్ గా స్టార్ మాలో 111 రోజులకు పైగా సాగిన బిగ్ బాస్ టు రియాల్టీ షో లో ఎట్టకేలకు అందరూ ఊహించినట్టే కౌశల్ టైటిల్ గెలిచాడు. మొదటినుంచి మిగతా కంటెస్టెంట్స్ ఎంతగా ఇబ్బంది పెట్టినా ఏమాత్రం బెణకకుండా, తొణకకుండా ఒకే విధానంలో తన గేమ్ ఆడుతూ అందరినీ సమర్ధంగా ఎదుర్కొన్నాడు. అదే కౌశల్ ప్లేస్ లో ఇంకొకరు ఉన్నట్టయితే మిగతావాళ్ళు పెట్టె ఇబ్బందులకు ఏడుస్తూ కూర్చోవడం బరస్ట్ అవ్వడమే చేసేవారు. కానీ కౌశల్ చాలా ఓర్పు నేర్పుతో ముందుకు సాగాడు. అతనికి అభిమానులు అండగా నిలిచారు. కౌశల్ ఆర్మీ రూపంలో సోషల్ మీడియాలో అభిమానులు పోషించిన పాత్రకు బిగ్ బాస్ నాని కూడా సరెండర్ అయ్యాడు. అందుకే కౌశల్ విజేత అయ్యాడు.

కౌశల్,తనీష్, గీతా మాధురి,దీప్తి నల్లమోతు ,సామ్రాట్ గ్రాండ్ ఫినాలేలో మిగిలారు. వీరి మధ్య హోరాహోరీగా పోరు నడించింది. ఎవరిది విజయం అనే విషయంపై వారం రోజులపాటు టెన్షన్ నడిచింది. ముందుగా సామ్రాట్,ఆ తర్వాత దీప్తి,అనంతరం తనీష్ లు పక్కన పెట్టేసి,కౌశల్ ని విన్నర్ గా ఎనౌన్స్ చేసారు. గీతా మాధురి రన్నర్ అప్ గా నిల్చింది.

అయితే అందరి అంచనాలకు తగ్గట్టుగా కౌశల్ విన్నర్ అవ్వడం, కౌశల్ ఆర్మీ పోరాటం సఫలమవ్వడం తో గేమ్ న్యాయంగా నడించిందన్న విషయం తేటతెల్లం అయింది. ఇంతవరకూ బానే ఉన్నా,దీప్తి నల్లమోతు విషయంలో అన్యాయం జరిగినట్లు కొన్ని సోషల్ వెబ్ సైట్స్ కోడై కూస్తున్నాయి. దీప్తి రెండవ స్థానం కాకుండా,నాల్గవ స్థానానికి రావడం ఆశ్చర్యంగా ఉందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

నిజానికి కొన్ని వెబ్ సైట్స్,పత్రికలూ కూడా గీతా మాధురి రన్నరప్ అని రెండు రోజులముందే రాసేసాయట. ఐతే కొన్ని ప్రయివేట్ వెబ్ సైట్స్ లో దీప్తికి వచ్చిన ఓట్లు చూస్తే రెండవ స్థానంలో కనిపించిందని,అయితే నాల్గవస్థానంలో నిలవడంతో దీప్తి అభిమానులు,కౌశల్ అభిమానులు కూడా ఆశ్చర్య పోయారని సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి.

మెసేజ్ లు కూడా పడ్తున్నాయి. అయితే నానికి ఎవరు క్లోజ్ గా ఉన్నారో వాళ్ళు రెండు మూడు స్థానాల్లో ఉండడం పెద్దగా ఆశ్చర్య పడక్కర్లేదని, అందుచేత పెద్దగా పట్టించుకోనవసరం లేదని మరికొందరు తేల్చేస్తున్నారు.