కౌశల్ ఆర్మీ కోసం సంచలన నిర్ణయం తీసుకున్న కౌశల్… దాంతో అభిమానులు ఖుషీ

మిగతా కంటెస్టెంట్స్ ఎంతగా ఇబ్బంది పెట్టినా ఏమాత్రం బెణకకుండా, తొణకకుండా బిగ్ బాస్ రియాల్టీ షోలో తాను అనుకున్నది చేస్తూ,తాను చెప్పదలచుకున్నది చెప్తూ టైటిల్ విజేతగా నిల్చినకౌశల్ అసలు సిసలైన పోటీ దారుడని చెప్పక తప్పదు. మోడల్ గా ఎంట్రీ ఇచ్చి, సినిమాల్లో ఆతర్వాత సీరియల్స్ లో నటిస్తున్న కౌశల్ జీవితంలో ఇంకా చాలా సాధించాలి ఉందని అంటున్నాడు. బిగ్ బాస్ ద్వారా అభిమానులు మనసు గెలవాలని అనుకుని అది సాధించేసాడు. ఇక తదుపరి ప్రణాళికలు సిద్ధం సిద్ధం చేసుకుంటున్నాడు. టివి,సినిమా రంగాల్లోకి వెళ్లాలనుకునేవారికి, ఉద్యోగ ఉపాధి రంగాల్లో రాణించాలనుకునే వారికీ వేదికగా ఓ ఏజన్సీ పెట్టడానికి సన్నద్ధం అవుతున్నట్లు తెల్సింది.

తన విజయాన్ని చూసి వందలాది మంది అభిమానులు తమ ఇంటికి వచ్చి అభినందిస్తుంటే తన కళ్ళు చెమర్చాయని కౌశల్ చెప్పుకొచ్చాడు. అంతగా నాపై అభిమానం కురిపించిన అభిమానుల కోసం తాను ఏం చేయగలనని, అందుకే సుమారు 500,600మందితో ఓపిగ్గా సెల్ఫీ దిగానని చెప్పాడు. వాళ్లందరినీ చూస్తుంటే, ఎంతో సంతోషం కలిగిందని అందుకే ఉదయం నుంచి సాయంత్రం వరకూ అలా ఫోటోలు దిగుతూనే ఉన్నానని చెప్పాడు.

చివరకి ఫ్రెండ్స్ ని కూడా పక్కన పెట్టి అభిమానులకే ప్రాధాన్యత ఇచ్చాడు. అభిమానుల కోరిక మేరకు మీసం మెలేసి అందరినీ ఆనందపరిచాడు. త్వరలో ఓ కొత్త ఏజన్సీ పెడతానని అందులో అభిమానులకు చోటు కల్పిస్తానని చెప్పాడు. ఎవరైనా టివి సీరియల్స్,సినిమాల్లో ఎంట్రీ ఇవ్వదలచుకుంటే అలాంటి వారికీ తాను పెట్టబోయే ఏజన్సీ ఫ్లాట్ ఫార్మ్ గా ఉపయోగపడితే అంతకన్నా తనకు కావాల్సిందేమీ ఉండదని అన్నాడు.