కౌశల్ ఆర్మీ పెయిడ్ ఆర్మీ…? అనే ప్రశ్నకు దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన కౌశల్

బిగ్ బాస్ రియాల్టీ షో విన్నర్ కౌశల్ నిజానికి ఈ షోకి రాకముందు అతనెవరో పెద్దగా ఎవరికి తెలియదు. ఓ మోడల్ గా,బిజినెస్ మ్యాన్ గా,టివి సీరియల్ నటుడిగా ఆయా రంగాలవారికి మాత్రమే తెలిసిన కౌశల్ రియాల్టీ షోతో మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఓ ఊపు ఊపేసాడు. దేశ సరిహద్దులు కూడా దాటి అభిమానం సంపాదించేసుకున్నాడు. హౌస్ లో తన తోటివాళ్ళు మూకుమ్మడిగా విరుచుకు పడుతున్నా సరే ఏమాత్రం సంయమనం కోల్పోకుండా తాను అనుకున్న లక్ష్యం వైపు దూసుకుపోయాడు. అందుకే లక్షలాది అభిమానులను సొంతం చేసుకున్నాడు.

లక్ష్యాన్ని నిర్దేశించుకుని అది సాధించిన కౌశల్ విన్నర్ గా బిగ్ బాస్ హౌస్ నుంచి ఇంటికెళ్ళ్లాడు. అయితే కొన్ని ఆసక్తికర విషయాలు ఈసందర్బంగా, ఓ ఇంటర్యూలో,ప్రతి మగాడు విజయం వెనుక ఓ మహిళ తప్పనిసరిగా ఉంటుందని, అలాగే తన విజయం వెనుక తన భార్య నీలిమ ఉందని చెప్పాడు. ‘నేను లోపల ఉండి 17మందితో ఫైట్ చేస్తే,ఆమె బయట ఉండి కొన్ని లక్షల మందితో ఫైట్ చేసింది.

నేను హౌస్ లో కృషిచేస్తే, ఈమె ఇంట్లోనే ఉండికృషి చేసింది’అంటూ ఎమోషన్ అయ్యాడు. అసలు నాకు వచ్చిన ఓట్లు చూసి, బయటకొచ్చాక చూసి షాక్ అయ్యానని చెప్పాడు. ఇక కౌశల్ ఆర్మీని ముందే క్రియేట్ చేసుకుని వెళ్లారన్న విమర్శలు వస్తున్నాయని అడిగిన ప్రశ్నకు కౌశల్ స్పందిస్తూ,’అందరికీ అయితే షోకి వెళ్తున్నట్లు నెలముందు తెలిస్తే,నాకు మాత్రం 9రోజుల ముందు మాత్రమే తెలుసు. ఇక 9రోజుల్లో నాకున్న వర్క్స్ కంప్లీట్ చేయడానికి రేయింబవళ్లు శ్రమించాను.

అలాంటప్పుడు ఆర్మీ క్రియేషన్ ఎక్కడ అవుతుంది. అయినా అలా చేయాల్సిన అవసరం లేదు. ఇక బయటకు వచ్చాక కొన్ని వీడియోస్ చూస్తే,కౌశల్ ఆర్మీని పెయిడ్ ఆర్మీ అన్నట్టు తెల్సి చాలా బాధ పడ్డాను. 2కె వాక్ ఆర్మీ నిర్వహిస్తే, పసిబిడ్డలతో సైతం పాల్గొన్నారు. అది చూసి కన్నీళ్లు వచ్చాయి’అని వివరించాడు.