వెంకీ ని బిగ్ బాస్ ఫినాలేకి పిలవడం ఎందుకు….అవమానించడం ఎందుకు?

బుల్లితెరపై 18మంది కంటెస్టెంట్స్ తో మొదలై, 110 రోజులకు పైనే నడిచిన బిగ్ బాస్ సీజన్ టు విజయవంతంగా ముగిసింది. హీరో నాని హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ టు రియాల్టీ షో లో చివరిలో కౌశల్,తనీష్, గీతా మాధురి,దీప్తి నల్లమోతు ,సామ్రాట్ గ్రాండ్ ఫినాలేలో మిగిలారు. ఇక ఎండింగ్ కి చేరే సరికి కౌశల్ , గీతా మాధురి మధ్య హోరాహోరీగా పోరు లో కౌశల్ విజేతగా టైటిల్ గెలిచాడు. గీతా రన్నరప్ అయింది. కౌశల్ పేరు మారుమోగిపోతోంది. కంటెస్టెంట్స్ కూడా బయటకు వెళ్ళాక మీడియాకు ఇంటర్యూలు ఇస్తున్నారు.

ఇక బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకి గెస్ట్ గా ఎవరిని పిలుస్తారా అనే దానిపై రెండు మూడు వారాల ముందు నుంచే జోరుగా ఊహాగానాలు సాగాయి. జూనియర్ ఎన్టీఆర్ వస్తాడని,కింగ్ నాగార్జున ను పిలుస్తున్నారని ఇలా రకరకాలుగా వార్తలు వచ్చాయి. అయితే చివరకు విక్టరీ వెంకటేష్ వచ్చాడు. విజేతలను ప్రకటించడానికి కౌశల్,గీతా లను వేదికమీదికి నాని పిలిచాక,గెస్ట్ వెంకీని కూడా తీసుకురావడంతో ఆడిటోరియం అంతా కేరింతలతో నిండిపోయింది.

కౌశల్,గీతా వచ్చినపుడు టపాసులు పిలిచారు గానీ, వెంకీ వచ్చినపుడు అలాంటి సందడి చేయలేదు. ఇక విన్నర్ ప్రకటన వెంకీ చేయలేదు. అసలు ఆయనను ఎందుకు పీల్చినట్లు,ఎందుకు వచ్చినట్లు అని కూడా చాలా మంది అనుకున్నారు. వెంకీ ఫాన్స్ కూడా ఆశ్చర్యానికి లోనయ్యారట. ఈ విషయాలపై సోషల్ మీడియాలో కథనాలు చక్కర్లు కొడుతున్నాయి.

విన్నర్ ని ప్రకటించాలని వెంకీని నాని కోరితే,ఆమ్మో నాకేమీ తెలీదు అదేదో మీరే చేయండని నానికి సూచించడం,నాని విజేతను ఎనౌన్స్ చేయడానికి సిద్ధమై, మళ్ళీ వెనక్కి తగ్గడం,మీరే ప్రకటించండని వెంకీని మరోసారి వెంకీని రిక్వెస్ట్ చేయడం,ఆతర్వాత నేను ఎందుకు చెప్పడం,స్క్రీన్ మీద చూద్దాం అంటూ చెప్పడం ఇలా సాగింది. మొత్తానికి విన్నర్ ని వెంకీ నోటితో మాత్రం ప్రకటించలేదు