బిగ్ బాస్ రెండో సీజన్ తర్వాత బిగ్ బాస్ ఇంటిని ఏమి చేస్తున్నారో తెలుసా?

తెలుగు టెలివిజన్ రంగంలో 100 రోజులకు పైగా సాగిన బిగ్ బాస్ సీజన్ 2ఎట్టకేలకు ముగిసింది. కౌశల్ విన్నర్ గా టైటిల్ సాధించగా, గీతామాధురి రన్నరప్ దక్కించుకుంది. బిగ్ బాస్ లో హోస్ట్ నాని వాయిస్ ఎంత ప్రధానమో బిగ్ బాస్ హౌస్ కూడా అంతే. వందలమంది కార్మికులు బిగ్ బాస్ హౌస్ ని తీర్చిదిద్దగా, ఇక రోజూ వందల కొద్దీ సిబ్బంది ఇందులో వివిధ విభాగాల్లో సేవలు అందించారు. బిగ్ బాస్ హౌస్ అనేది ఓ సెట్టింగ్. సినిమా సెట్టింగ్ మాదిరిగా దీన్ని తీర్చిదిద్దారు.

తొలి సీజన్ పూణే లో జరిగినప్పుడు అక్కడ సెట్ వేశారు. మరి సీజన్ టు హైదరాబాద్ లో జరిగినందున అన్నపూర్ణ స్టూడియోలో బిగ్ బాస్ హౌస్ సెట్ వేశారు. మళ్ళీ సీజన్ ఎక్కడ వేస్తారో ఇంకా పూర్తిగా క్లారిటీ లేదు. వేరే చోట నిర్వహిస్తే అక్కడ ప్రత్యేకంగా సెట్ రూపొందిస్తారు. ఒకవేళ హైదరాబాద్ లోనే వచ్చే సీజన్ కూడా నిర్వహిస్తే, ప్రస్తుత సెట్ లోని వస్తువులను మార్పులు చేసి వినియోగించి,కొత్త సెట్ వేస్తారు. అందుకే ప్రస్తుత సెట్ ని అందుకు అనుగుణంగా వేశారు.

సీజన్ టు సెట్ ని ఇష్టం వచ్చినట్లు మార్పు చేసుకోవచ్చు, ఎక్కడికి కావాలంటే అక్కడకు మార్చుకోవచ్చు. ఒక సీజన్ కి ఉపయోగించిన సెట్ ని మరో సీజన్ లో వినియోగించకుండా ఎప్పటికప్పుడు కొత్తగా హంగులు సమకూరుస్తుంటారు. అయితే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ సెట్ ని తొలగించే పనిలో కార్మికులు సమాయత్తమయ్యారట. మళ్ళీ వినియోగించుకోడానికి వీలుగా గల బెడ్స్, సోఫా సెట్స్ వంటివాటిని భద్రపరుస్తారు. డైనింగ్ టేబుల్స్,గ్లాస్ డోర్స్ ,బాత్ రూమ్స్ సెట్స్ వంటి వాటిని పూర్తిస్థాయిలో కలర్స్ చేంజ్ చేసి , వచ్చే సీజన్ కి వినియోగిస్తారట.