బిగ్ బాస్ విన్నర్ లకు కాజల్ కి ఒక రిలేషన్ ఉంది…అది ఏమిటో తెలుసా?

తెలుగు బిగ్ బాస్ రెండో సీజన్ చాలా సక్సెస్ గా పూర్తీ అయింది. బిగ్ బాస్ మొదటి సీజన్ లో శివబాలాజీ విన్నర్ అయితే రెండో సీజన్ లో కౌశల్ విన్నర్ అయ్యాడు. బిగ్ బాస్ రెండో సీజన్ ప్రారంభం అయినా నాల్గో వారంలోనే కౌశల్ విన్నర్ అవుతాడని తేలిపోయింది. బిగ్ బాస్ రెండు సీజన్స్ లో గెలిచినా శివబాలాజీ,కౌశల్ కి ఒక పోలిక ఉంది. ఆ పోలిక హీరోయిన్ కాజల్ అగర్వాల్. అవును వీరిద్దరికి కాజల్‌కు సినిమాల ద్వారా రిలేషన్‌ ఉంది. చందమామ సినిమాలో కాజల్‌తో పాటు శివబాలాజీ నటించిన విషయం తెల్సిందే. ఆ సినిమాలో కాజల్‌కు శివబాలాజీ బావ వరుస అవుతాడు.

ఇక ప్రభాస్‌ హీరోగా నటించిన ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’ సినిమాలో కాజల్‌కు బావగా కౌశల్‌ నటించాడు. కౌశల్‌కు కాస్త పాత్ర తక్కువ ఉన్నా కూడా మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌లో మంచి పాత్రను ఆయన దక్కించుకున్నాడు. కీలకమైన సీన్స్‌లో కౌశల్‌ ఆ సినిమాలో కనిపిస్తాడు. ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్‌ వద్ద సంచలన విజయాలను దక్కించుకున్నాయి అనే విషయం తెల్సిందే.

తెలుగు బిగ్‌ బాస్‌ రెండు సీజన్‌లను ప్రారంభించుకుని, రెండు సీజన్‌ల విన్నర్స్‌ కూడా కాజల్‌ బావలు అవ్వడంతో సోషల్‌ మీడియాలో మీమ్స్‌కు కొదవ లేకుండా పోయింది. కాజల్‌కు బావ అయితే బిగ్‌ బాస్‌ సీజన్‌ విన్నర్‌ అయిపోవచ్చు అంటూ ప్రచారం జరుగుతుంది. బిగ్‌ బాస్‌ సీజన్‌ 3లో కూడా కాజల్‌ బావ ఎవరో ఒకరు ఉండే అవకాశం ఉంది. ఆ వ్యక్తే గెలుస్తాడని అంతా కూడా సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ చేస్తున్నారు.