సంచలన నిర్ణయాన్ని తీసుకున్న కౌశల్ ఆర్మీ… ఆ నిర్ణయాన్ని కౌశల్ సమర్ధిస్తాడా?

బుల్లితెరపై 18మంది కంటెస్టెంట్స్ తో మొదలై, 110రోజులకు పైనే నడిచిన బిగ్ బాస్ సీజన్ టు లో కౌశల్ విజేత కావడంతో అతని పేరు సర్వత్రా మారుమోగుతోంది. ఎవరీ కౌశల్ అంటూ తెలియని వారు సైతం తెలుసుకుంటున్నారు. హీరో నాని హోస్ట్ గా మొదలైన బిగ్ బాస్ టు రియాల్టీ షో లో చివరిలో కౌశల్,తనీష్, గీతా మాధురి,దీప్తి నల్లమోతు ,సామ్రాట్ గ్రాండ్ ఫినాలేలో మిగిలారు. ఇక ఎండింగ్ కి చేరేసరికి కౌశల్ , గీతా మాధురి మధ్య హోరాహోరీగా పోరు నడించింది. కౌశల్ విజేతగా టైటిల్ గెలిచాడు. గీతా రన్నరప్ అయింది.

మోడల్ గా,టివి సీరియల్ నటుడిగా రాణించిన కౌశల్ బిగ్ బాస్ షో ద్వారా అందరికీ పరిచయం అయ్యాడు. ఇక విజేతగా కూడా నిలవడంతో ఎక్కడ చూసినా కౌశల్ కౌశల్ అనే నామస్మరణ అవుతోంది. హౌస్ లో ఎంతమంది ఎన్నిరకాలుగా ఇబ్బంది పెట్టినా తన లక్ష్యం మరిచిపోకుండా ఆడితే,మిగతావాళ్ళు పక్కదారి పట్టరాని ,అందుకే కౌశల్ అంటే తమకు వల్లమాలిన అభిమానమని చెబుతున్నారు అభిమానులు.

ఇక కౌశల్ తో సినిమా కూడా తీయాలని కౌశల్ ఆర్మీ భావిస్తోందట. ఇందుకోసం అభిమానులు నిధులు సేకరించే పనిలో పడ్డారట. ఇది తెల్సిన కౌశల్ మరింత ఎమోషన్ అయ్యాడు. నాకోసం ఎన్నో చేసిన అభిమానులకోసం తాను కూడా ఏదైనా చేయాలని,అందుకే ఎవరో ఒక నిర్మాత తనకు ఛాన్స్ ఇవ్వాలని అంటున్నాడు. చూద్దాం ఏమి జరుగుతుందో.