ప్రదీప్ కోసం 14 మంది అమ్మాయిలు వెయిటింగ్… ప్రదీప్ పెళ్ళిచూపుల్లో ఊహించని సంఘటన

బిగ్ బాస్ రియాల్టీ షో ముగియడంతో ఆ స్థానంలో మోస్ట్ బ్యాచిలర్ ప్రదీప్ పెళ్లిచూపులు మొదలయ్యాయి. నిజం , ఈ పెళ్ళిచూపుల్లో సెలెక్ట్ అయిన అమ్మాయిలతో ప్రదీప్ డేటింగ్ చేస్తాడు. ఒక్కో వారం ఒక్కొక్కరు ఎలిమినేట్ అవుతూ వస్తారు. చివరకు మిగిలిన అమ్మాయిని ప్రదీప్ పెళ్లాడతాడు. అయితే ఏకంగా 14 మంది అమ్మాయిలు ప్రదీప్ మాచిరాజు కోసం దేశ విదేశాల నుంచి వచ్చారు. వీళ్లంతా ప్రదీప్ ని మాటలతో పొగిడేశారు. చూపులతో గుచ్చేశారు. అయితే ఈ ప్రోగ్రామ్ కి యాంకర్ సుమ హోస్ట్ కావడం విశేషం.మచిలీ పట్నం నుంచి వచ్చిన దివ్య విజయవాడలో జాబ్ చేస్తోంది. ‘నీది యూనిక్ స్టైల్. మీరు మాట్లాడే విధానం సూపర్. మీరు ఇంప్రెస్ చేసే విధానం బావుంది. నేను ఈ షోకి సెలక్ట్ అయ్యాక మీపై ఇంకా ప్రేమ పెరిగిపోయింది’అని ఆమె పేర్కొంది.

మలేషియా నుంచి వచ్చిన నేహా అజ్మర్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది. ‘మీరు చాలా హ్యాండ్ సమ్ గా ఉన్నారు. మిమ్మల్ని చూస్తుంటే గుండె జారిపోతోంది’అని వ్యాఖ్యానిస్తూ, మలేషియా నుంచి తెచ్చిన స్పెషల్ గిఫ్ట్ అందజేసింది. విజయవాడకు చెందిన కోనేరు రమ్యకృష్ణ మీరంటే చాల ఇష్టమని చాలా ఆరాధిస్తున్నానని చెప్పింది. మిమ్మల్ని చూడగానే నన్ను నేను మరిచిపోయానని, మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న అని హైద్రాబాద్ నుంచి వచ్చిన శ్రేయ చెప్పింది.

‘ఇదే నా లాస్ట్ పెళ్లిచూపులు. మిమ్మల్ని కలుస్తానని అస్సలు ఊహించలేదు’అని విజయవాడకు చెందిన దాసరి సాహితి పేర్కొంటూ ఓ గిఫ్ట్ కూడా ఇచ్చింది. ప్రదీప్ నచ్చడానికి గల 101 కారణాలు ఆ గిఫ్ట్ లో ఉన్నాయట. ఇక ఎస్వీ కనకాల సౌజన్య అనే అమ్మాయి మాట్లాడుతూ ‘ఈ షోకి వస్తూనే ఎస్వీ మాచిరాజు గా తిరిగి వస్తానని చెప్పాను. మిమ్మల్ని చూడగానే కౌగిలించుకోవాలని అనిపించింది. కానీ మీరే నన్ను హత్తుకునేలా చేస్తా’అని చెప్పింది.

ఇక రీతూ శేఖర్ రావడంతోనే ప్రదీప్ ని పొగిడేస్తూ ఓ గిఫ్ట్ ఇచ్చింది. కడపకు చెందిన మౌనిక ఓ గిఫ్ట్ ఇచ్చి ప్రదీప్ తో కొన్ని స్టెప్స్ వేయించింది. అనంతపురానికి చెందిన డయానా రావడానికి ముందు వాళ్ళ అమ్మ రావడంతో ప్రదీప్ ఖంగు తిన్నాడు. అయితే తర్వాత డయానా ఎంట్రీ ఇస్తూ నీ కోసం ఏమి చేయడానికైనా రెడీ అంటూ ఓపెన్ అఫర్ ఇచ్చేసింది.

బెంగుళూరు కి చెందిన చంద్రకళ,నాగపూర్ కి చెందిన నివ్య అశోక్ డెకాటే లు ప్రదీప్ ని ప్రశంసలతో ముంచెత్తారు. అయితే ,షేక్ సబీనా అయితే ప్రదీప్ కోసం ఓ పాట అందుకుంది. కందిరేగుల జ్ఞానేశ్వరి కళ్ళజోడు గిఫ్ట్ ఇచ్చింది. మలయాళీ చెందిన దీనా దుబాయ్ నుంచి వచ్చి,నీకోసం జాబ్ కూడా వదిలేసి ఇంట్లోవాళ్ళని ఒప్పించి వచ్చాను అని చెప్పింది.