పెళ్లి చూపులు షో కి ప్రదీప్ రోజుకి ఎంత పారితోషికం తీసుకుంటున్నాడో తెలిస్తే మతిపోతుంది

టెలివిజన్ రంగం విస్తృతమయ్యాక ఎన్నో చానల్స్ వచ్చేసాయి. న్యూస్ ఛానల్స్ తో పాటు,ఎంటర్ టైన్ మెంట్, భక్తి,కార్టూన్ ఇలా విభిన్న ఛానల్స్ రంగంలోకి వచ్చాయి. ముఖ్యంగా ఎంటర్ టైన్ మెంట్ రంగంలో ఛానల్స్ కి యాంకర్స్ కీలకం అయ్యారు. ఒక్కప్పుడు సుమ,ఝాన్సీ,ఉదయభాను ఇలా అందరూ లేడీస్ యాంకరింగ్ తో బాగా ఆకట్టుకుంటూ వచ్చారు. అయితే మగవాళ్ళు కూడా యాంకరింగ్ లో ఇరగదీయగలరని ప్రదీప్ నిరూపించాడు. కొంచెం టచ్ లో ఉంటె చెబుతా ద్వారా సెలబ్రిటీలను ఆహ్వానించి,వారి తీపి గుర్తులను షేర్ చేసుకునేలా చేయడంతో పాటుగా,వారు నటించిన న్యూ సినిమాలకు ప్రమోషన్ ఇచ్చేవిధంగా తీర్చిదిద్ది,అందరి మన్ననలను అందుకున్నాడు.

ఓ సెలబ్రిటీ గా ప్రదీప్ మారిపోయాడు. యాంకరింగ్ రంగంలో నెమ్మదినెమ్మదిగా ఎదుగుతూ వచ్చిన ప్రదీప్ మొదట్లో నెలకు 15 వేలు మాత్రమే తీసుకునేవాడు. ముఖ్యంగా జీ టివి నిర్వహించిన అత్తా కోడళ్ల షో కోసం ఒక్కొక్క ఊరు వెళ్లి అక్కడ అత్తా కోడళ్లను సెలక్ట్ చేసి వారి మధ్య గేమ్స్ నిర్వహిస్తూ అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ ప్రోగ్రాంతో అతడి రెమ్యునరేషన్ నెలకు లక్షకు చేరిపోయింది. దాని తర్వాత కొంచెం టచ్ లో ఉంటె చెబుతా షోతో సూపర్ సక్సెస్ అయ్యాడు.

ఇక ఇప్పుడు తాజాగా స్టార్ మా లో పెళ్లిచూపులు పేరిట ఓ రియాల్టీ షో స్టార్ట్ చేసాడు. దాదాపు 100 రోజులకు పైనే నడిచిన బిగ్ బాస్ సీజన్ టు ముగియడంతో ఆ ప్లేస్ లో పెళ్లిచూపులు మొదలు పెట్టాడు. ఇది ఎన్నో ఎపిసోడ్స్ నడుస్తుందో గానీ,ఇది సక్సెస్ అయితే ఇతగాడికి పిల్ల కూడా దొరుకుతుంది. ఇక ఈ షోలో ఏకంగా ఒక్కొక్క ఎపిసోడ్ కి లక్షన్నర నుంచి 2లక్షల వరకూ ఛార్జి చేస్తున్నాడట. పెళ్లి సెటిల్ అయ్యే టైం కి డబ్బు కూడా బానే కూడబెడతాడన్న మాట.