గీతా గోవిందం సినిమా తర్వాత విజయ్ దేవరకొండ పారితోషికం ఎంత పెంచాడో తెలుసా?

విజయ్ దేవరకొండ పెళ్లిచూపులు సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. అర్జున్ రెడ్డిలో తన సహజమైన నటనతో విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు పొందాడు. ప్రస్తుతం గీత గోవిందం హిట్ తో దూసుకుపోతున్న విజయ్ నటించిన ‘నోటా ‘ప్రేక్షకుల ముందుకి త్వరలో రానుంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు యూత్ లోనే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా మంచి క్రేజ్ సంపాదించాడు.

విజయ్ పారితోషికం అర్జున్ రెడ్డి సినిమాకి ముందు చాలా తక్కువే అని చెప్పాలి. ఒక్క హిట్ పడేసరికి పారితోషికం భారీగా పెంచేసాడని పరిశ్రమలో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. గీతా గోవిందం సినిమా తర్వాత ఒప్పుకున్న సినిమాలకు పారితోషికం భారీగా డిమాండ్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై విజయ్ దేవరకొండ స్పందిస్తూ…. తను ఎంత తీసుకుంటున్నాడో చెప్పలేదు కానీ.. పారితోషికాన్ని అమాంతం పెంచేసింది మాత్రం లేదన్నాడు. ఏ సినిమాకు ఆ సినిమా ఇదే చివరిది అన్నట్టుగా పని చేస్తాను తప్ప.. ప్లాన్లు వేసుకుని, డబ్బులు డిమాండ్ చేసేదేమీ లేదన్నాడు.