కోట్ల ఆస్తిని సంపాదించినా విజయశాంతికి పిల్లలు లేకపోవటానికి కారణం ఎవరో తెలుసా?

ఒకప్పుడు యాక్షన్ చిత్రాలతో పాటు లేడీ ఓరియెంటెండ్ పాత్రలతో రాణించి, లేడీ అమితాబ్ గా పేరొందిన విజయశాంతి హీరోలతో సమానమైన క్రేజ్ సొంతం చేసుకుంది. అందాల నటిగా ఎన్నో చిత్రాల్లో గ్లామర్ పాత్రలను అలవోకగా పోషించిన ఈమె అందంతో పాటు అభినయంలోనూ తనకు తానె సాటి అనిపించుకుంది. హీరోలతో సరి సమానంగా రెమ్యునరేషన్ కూడా అందుకున్న బిగ్ స్టార్ ఆమె. సినిమాల్లో కెరీర్ బాగున్నప్పుడే ఎంవి శ్రీనివాస ప్రసాద్ అనే బిజినెస్ మ్యాన్ ని పెళ్ళిచేసుకుని లైఫ్ లో సెటిల్ అయింది.

అయితే ఆమె రాజకీయాల్లోకి వచ్చాక పెద్దగా రాణించలేకపోయింది. సున్నిత మనస్కులు రాజకీయాల్లో రాణించలేరని, రాజకీయాల్లో ఒడిదుడుకులు తట్టుకోలేక వెనక్కి వెళ్లిపోతున్నారని చిరంజీవి, పవన్ కళ్యాణ్ రాజకీయాల గురించి అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా విజయశాంతి చెప్పుకొచ్చింది. సినిమాల్లో శోభన్ బాబు,కృష్ణ, చిరంజీవి,బాలకృష్ణ , వెంకటేష్,నాగార్జున,ఇలా టాప్ హీరోలందరితో విజయశాంతి నటించి హిట్ ఫెయిర్ గా నిల్చింది.

దాదాపు ఆమె నటించిన చిత్రాలన్నీ సూపర్ డూపర్ హిట్స్ అయ్యాయి. తెలుగులో తిరుగులేని స్టార్ పొజిషన్ తెచ్చుకోవడమే కాదు,దక్షిణాది భాషలన్నింటా నటించి మెప్పించింది. ఎన్ని ఉన్నా పిల్లలు కూడా ఉంటేనే అందం అంటారు. అయితే విజయశాంతి పిల్లలు వద్దని అనుకుందట. అందుకే భర్తతో చెబితే అతను కూడా ఆమోదం తెల్పాడట.

పైగా అనారోగ్యం వలన కూడా పిల్లలు వద్దనుకున్నట్లు ఆమె చెప్పారు. ఎందుకంటే మేజర్ సర్జరీ కూడా జరిగి, చాలాసమయం వరకూ కోలుకోలేనందున పిల్లల ఊసు కి దూరంగా ఉన్నానని కూడా చెప్పుకొచ్చింది. ఇక పిల్లలుంటే వాళ్ళకోసం ఏదో కూడబెట్టాలన్న స్వార్ధం వస్తుందని కూడా ఆమె పేర్కొన్నారు.
Vijayashanthi – MP from Medak Constituency
అయితే ప్రజాసేవకోసమే రాజకీయాల్లోకి వచ్చినందున ప్రజలే తనకు పిల్లలని ఆమె ఓ ఇంటర్యూలో కూడా చెప్పింది. తన సంపాదన ప్రజల నుంచి వచ్చిందే కనుక తిరిగి వారికే ఇచ్చేస్తానని,ఇందుకోసం ఓ ట్రస్ట్ పెట్టాలని భావిస్తున్నానని ఆమె చెప్పింది. భర్త కూడా ఇందుకు ప్రోత్సాహం అందిస్తున్నట్లు వెల్లడించింది.