ఎన్టీఆర్ బయోపిక్ పై విపరీతమైన టెన్షన్ లో క్రిష్ .. మరి బాలయ్య ఏమంటున్నాడు

ఇది బయోపిక్ సీజన్ అని చెప్పవచ్చు. ఇప్పటికే మహానటి పేరిట సావిత్రి జీవిత కథను తెరకెక్కించి,సక్సెస్ కొట్టడంతో ఆ దిశగా అడుగులు బానే పడుతున్నాయి. ముఖ్యంగా తెలుగు చిత్రసీమలో రారాజుగా వెలుగొంది,రాజకీయాలలో ప్రభంజనం సృష్టించిన ఎన్టీఆర్ తెలుగువారి కీర్తి పతాకను నలుదిశలా చాటారు. ముఖ్యమంత్రిగా ఎన్నో అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. అటువంటి మహానటుడు జీవితాన్ని చిత్రంగా మలుస్తున్న సంగతి తెల్సిందే. ఎన్టీఆర్ గా నందమూరి బాలకృష్ణ నటిస్తుంటే,ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో విద్యాబాలన్,చంద్రబాబు పాత్రలో రానా,అక్కినేని పాత్రలో సుమంత్,శ్రీదేవి పాత్రలో రకుల్ ప్రీతి సింగ్,జయప్రదంగా రాశీఖన్నా నటిస్తున్నారు.

స్టార్ హీరోస్ నటిస్తున్న ఎన్టీఆర్ మూవీకి క్రిష్ జాగర్లమూడి డైరెక్ట్ చేస్తున్నాడు. అయితే ఎన్టీఆర్ చరిత్రను కేవలం రెండున్నర గంటల్లో చెప్పడం చాలా కష్టమని,ఏమాత్రం చెప్పాల్సిన విషయాలు కట్ చేసి, చూపిస్తే అభిమానులు నిరుత్సాహ పడతారని ఎలా చూసినా రెండున్నర గంటల్లో తీయడం సాధ్యం కాదనే నిర్ణయానికి వచ్చేయడంతో ఇప్పుడు ఏం చేయాలనే దానిపై క్రిష్ తెగ టెన్షన్ పడిపోతున్నాడట. నిడివి పెంచితే అంతసేపు చూడడం కూడా కష్టమని మదనపడ్తున్నాడు. దీన్ని గమనించిన బాలకృష్ణ ఓ సూచన చేసాడట.

బాలయ్య చెప్పిన ప్రకారం ఎన్టీఆర్ మూవీ రెండు భాగాలుగా విడుదల చేయాలని భావిస్తున్నారట. రాజమౌళి బాహుబలి మాదిరిగా, ఎన్టీఆర్ బయోపిక్ ని కూడా సమగ్రంగా తీసి,రెండు భాగాలుగా విడగొట్టి, మొదటి భాగం జనవరిలో విడుదల చేయాలని, రెండవ భాగం రెండు నెలల గ్యాప్ లో రిలీజ్ చేయాలనీ కూడా సూత్రప్రాయంగా నిర్ణయం చేసారని టాక్. అదే నిజమైతే నందమూరి అభిమానులకు పండగే పండగ.