ఎవరు ఊహించని నిర్ణయం తీసుకున్న చరణ్…. కారణం ఉపాసన…? చిరు రియాక్షన్ ఏమిటో చూడండి

భార్యలు చెబితే వినేసి వాటిని అమల్లో పెట్టె స్టార్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో బానే ఉన్నారట. ముఖ్యంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఈ విషయంలో భార్య ఉపాసన ఇచ్చే సూచనలు పాటిస్తున్నారు. అందుకే ఆయన నిర్మాతగా వ్యవహరిస్తున్న సైరా నరసింహారెడ్డి మూవీ యూనిట్ కి పంట పండిందని అంటున్నారు. వివరాల్లోకి వెళ్తే,ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్ లో చెర్రీ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీలో నటిస్తున్నాడు. దీనికి స్టేట్ రౌడీ అనే పేరు కూడా ఖరారు చేయాలని భావిస్తున్నారట. అజర్ బైజాన్ లో షెడ్యూల్ పూర్తిచేసుకున్న చెర్రీ అటునుంచి అటే జార్జియాలో షూటింగ్ జరుపుకుంటున్న సైరా లొకేషన్ కి వెళ్ళాడట.

చిరంజీవి 151వ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా చెర్రీ తన కొణిదల బ్యానర్ మీద తీస్తున్న సంగతి తెల్సిందే. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తీస్తున్న సైరా మూవీ యుద్ధ సన్నివేశాలను గత కొన్ని రోజులుగా జార్జియాలో తెర కెక్కిస్తున్నారు. అయితే చాలారోజుల నుంచి యూనిట్ సభ్యులు ఇంటిని వదిలిపెట్టి షూటింగ్ దగ్గర బిజీగా ఉండడంతో చెర్రీ చలించిపోయాడట. అందుకే దసరా పండుగ కూడా సమీపిస్తున్నందున పెద్ద ఎత్తున నగదును యూనిట్ సభ్యుల చేతిలో పెట్టాడట.

ఒక్కొక్కరికీ 50వేల రూపాయల చొప్పున అందిస్తూ పిల్లలకోసం షాపింగ్ చేసుకోమని చెర్రీ చెప్పాడట. ఇంతకుముందెన్నడూ ఈవిధంగా పండుగ సందర్భగా ఇచ్చిన దాఖలాలు లేవట. పైగా షూటింగ్ లో ఇంతపెద్ద మొత్తం అందించడంతో యూనిట్ సభ్యులు ఫిదా అయ్యారట. అంతేకాదు షాపింగ్ లో సమస్యలు రాకుండా సొంత స్టాఫ్ ని వాళ్ళ కూడా పంపించాడట.

ఇక కోట్లాది రూపాయలు పెట్టి షూటింగ్ తీస్తున్నందున ఎక్కడైనా సెట్ లో వస్తువులు పాడైపోతే కూడా చెర్రీ కోపం చూపించకుండా ప్రేమగా ఉంటున్నాడట. ఇంతకీ చెర్రీ ఇంతగా యూనిట్ సభ్యులకు ,వారి పిల్లలకోసం ఇలా చేయడం వెనుక భార్య ఉపాసన ఇచ్చిన సలహా ఉందని అందరూ అంటున్నారు.