శిల్పా శెట్టి ఎవరిని ప్రేమించి మోసపోయిందో తెలుసా? ఎందుకు బ్రేక్ అప్ అయింది

శిల్పాశెట్టి అనగానే తెలుగులో సాహస కన్య సాగర వీరుడు మూవీ గుర్తొస్తుంది. మత్యకన్యగా అద్భుత నటన కనబరిచిన శిల్పా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేసుకుంది. నిజానికి 1993లో బాజీగర్ మూవీతో హిందీలో ఎంట్రీ ఇచ్చిన ఈమె ఆ మూవీలో ఉత్తమ సహాయనటి ఫిలిం ఫెర్ కి నామినేట్ అయింది. అయితే చిన్నప్పుడు లవ్ లో ఫెయిల్ అయిందట. దాంతో ఇక జీవితంలో ఆ జోలికి వెళ్లకూడదని అనుకుందట. 1975జులై 8న సునంద,సురేంద్ర శెట్టిలకు జన్మించిన శిల్పా కు చిన్నప్పటి నుంచి మోడలింగ్ పై ఆసక్తి కారణంగా ఫిలిం ఇండస్ట్రీ దిశగా నడిచింది. హీరోయిన్ గా, నిర్మాతగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఈమె అన్ని భాషల్లో కలిపి 40 చిత్రాల్లో నటించింది. ఈమె ప్రస్తుతం రచయితగా, రియాలిటీ షో జడ్జిగా వ్యవహరిస్తోంది. ఇక ఈమెకు 2009లో రాజ్ కుంద్రాతో పెళ్లయ్యింది.

అంతే కాదు డేటింగ్ రియాల్టీ షో ‘ హి ఆర్ మీ లవ్’ లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న శిల్పా ప్రస్తుత జనరేషన్ కి సరిపడుతుందని వ్యాఖ్యానించింది. వినోదాన్ని అందించే ఇలాంటి రియాల్టీ షోలను ఆడియన్స్ బాగా ఇష్టపడుతున్నారని ఆమె తెలిపారు. ఇదే సందర్భంలో చిన్ననాటి ప్రేమ,డేటింగ్ గురించి చెప్పుకొచ్చింది. ‘కాలేజీ చదువుకునే రోజుల్లో ఓ అబ్బాయి రోజూ సాయంత్రం ఫోన్ చేసేవాడు. ఆకర్షణకు గురయ్యే వయస్సే కదా. నేను కూడా ఎట్రాక్ట్ అయ్యాను. అప్పట్లో ల్యాండ్ లైన్ లే కదా.

ఒంటరిగా ఉంటె మాట్లాడేదాన్ని. ఒకవేళ నాన్న వస్తే, కట్ చేసేదాన్ని’అని వివరించింది.’ఇక ప్రతిరోజూ అతడి ఫోన్ కోసం ఎదురుచూసేదాన్ని. అయితే ఓరోజు బస్ స్టాఫ్ లో కలుద్దామని చెప్పాను. అతడు సరేనన్నాడు. కానీ అప్పటికీ అతడి పేరు కూడా తెలీదు. అతనూ చెప్పలేదు. నేను బస్ స్టాప్ కి వెళ్ళాను. కానీ అతడు రాలేదు. చూసి చూసి విసుగు వచ్చింది. అతనితో బంధం తెంచుకోవాలని భావించాను.

అయితే అప్పుడు ఓ నిజం తెల్సి చాలా బాధ పడ్డాను. అదేమిటంటే, నాతో ఫోన్ లో మాట్లాడతానని నా ఫ్రెండ్స్ తో అతడు పందెం వేసాడట. అందుకే ఫోన్ లో రోజూ మాట్లాడుతూ ప్రేమ నటించాడట. ఇదంతా సినిమా కథ అనిపించింది. కానీ నిజమే కదా. అందుకే చాలా బాధ పడ్డాను. ఇక జీవితంలో ప్రేమ జోలికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నాను’అని శిల్పా చెప్పుకొచ్చింది.