షో మధ్యలో యాంకర్ సుమ ఏడ్చేసింది – ఎందుకో తెలుసా

టెలివిజన్ రంగంలో యాంకర్ ల వ్యవస్థ కీలకం గా వస్తోంది. అయితే వ్యాఖ్యాతగా వ్యవహరించడం మామూలు విషయం కాదు. ఎంతో ఓర్పు నేర్పు కావాలి. చాకచక్యంగా,సందర్భోచితంగా మాట్లాడాలి. సంయమనం ఉండాలి. హాస్యం మేళవించాలి. మాటల్లో స్పష్టత,చక్కని హావభావాలు అన్నింటి కన్నా ముఖ్యం. ఇవన్నీ ఉన్న యాంకర్ ఎవరని అడిగితె అందరూ చెప్పే పేరు సుమ. నెంబర్ వన్ యాంకర్ గా ఆమె రాణిస్తోంది. అవును గడిచిన కొన్ని దశాబ్దాలుగా సక్సెస్ కి మారుపేరుగా సుమ పేరు వినిపిస్తుంది. షో ఎలాంటిదైనా ఆమె యాంకర్ అయితే చాలు హిట్ అవుతుందన్న మాటా వచ్చేసింది. స్టార్ మహిళ ప్రోగ్రాం తో స్టార్ యాంకర్ అయిన సుమ ఈ మధ్య ప్రోగ్రామ్స్ ని కుదించేసుకుంది.

చాలా సెలెక్టివ్ ప్రోగ్రాం కి మాత్రమే యాంకర్ గా కనిపిస్తున్న సుమ తాజగా యాంకర్ ప్రదీప్ పెళ్లిచూపులు ప్రోగ్రాం కి యాంకర్ గా వ్యహరిస్తోంది. రొటీన్ కి భిన్నంగా బుల్లితెరపై వస్తున్న షోస్ లో పెళ్లిచూపులు ఒకటి. స్టార్ మాలో బిగ్ బాస్ సీజన్ టు ముగిశాక, ఆ ప్లేస్ లో వస్తున్న పెళ్లిచూపులు రియాల్టీ షో ద్వారా యాంకర్ ప్రదీప్ జీవిత భాగస్వామిని ఎంచుకుంటాడు. నిజానికి హిందీలో రాహుల్ కి దునియా,రాఖీ కా స్వయంవరం వంటి షో లు అలాగే తమిళంలో ఆర్యతో యంగవీటి మా పిళ్ళై పేరుతొ విజయవంతమైన ఇలాంటి షో లు విజయవంతం అయ్యాయి.

ఇప్పుడు తెలుగులో చేస్తున్న ఈ షో కోసం దేశవిదేశాల్లో ఎందరో తెలుగమ్మాయిలు రిజిస్టర్డ్ చేసుకోగా 14మందిని సెలక్ట్ చేసారు. ఈ షో ని ఆడియన్స్ లో కొందరు ఎంజాయి చేస్తుంటే, మరికొందరు ఇవేమి పెళ్లిచూపులు రా బాబు అని నిట్టూరుస్తూ వీక్షిస్తున్నారు. మరికొందరు తిట్టుకుంటున్నారు.
suma kanakala
తెలుగు నేటివిటీ కోసం సుమను హోస్ట్ గా సెలెక్ట్ చేసారు. ప్రదీప్ ని ఉద్దేశించి లెటర్ రాయమని 14మంది సెలక్టర్లను కోరిన సుమను ,రాజీవ్ కి లెటర్ రాయమని ప్రదీప్ కోరాడు. దీంతో లెటర్ మొదలు పెట్టి, రాస్తూనే ఒక్కసారిగా కంటతడి పెట్టింది. ఆమె కు తెలియకుండానే ఏడ్పు వచ్చేసింది. ఇలాంటి ఎమోషన్ గల అమ్మాయిని ఈ షో ద్వారా ప్రదీప్ ఎంచుకుంటాడట.