కౌశల్ కి ప్రైజ్ మనీ కాకుండా పైన ఎంత వచ్చిందో తెలుసా? అందుకే 50 లక్షలు దానం చేశాడా?

బిగ్ బాస్ షోతో విజేతగా నిలవడమే కాదు తెలుగు రాష్ట్రాల్లో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకున్న కౌశల్ మోడల్ ఏజెన్సీ ద్వారా,టివి సీరియల్స్ ద్వారా సంపాదించే సొమ్ములోంచి ఇప్పటికే పేదలు,ఆపన్నులకు సాయం అందిస్తూ వస్తున్నాడు. హీరోగా సినిమాల్లో నిలదొక్కుకోవాలన్న యాంబిషన్ తో బిగ్ బాస్ లోకి అడుగుపెట్టిన కౌశల్ ఈ షో ద్వారా గెలిచిన 50లక్షల రూపాయల ప్రయిజ్ మనీ ని కూడా కాన్సర్ తో బాధపడేవాళ్లకు ఇవ్వనున్నట్లు ప్రకటించాడు.

అయితే 50 లక్షల రూపాయలను కాన్సర్ పేషంట్స్ కి ఇస్తాడని ప్రకటన చేయగానే చాలామంది హ్యాపీ ఫీలయినప్పటికీ అసలు ఎలా ఇస్తాడనే దానిపై చర్చ నడుస్తోంది. అంత డబ్బు ఇచ్చేస్తానంటే, అంతకంటే ఎక్కువ సొమ్ము అతని దగ్గర ఉందా,అసలు ఈ సొమ్ము ఏవిధంగా అందిస్తాడు వంటి ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. నిజానికి బిగ్ బాస్ షోలో గెల్చుకున్న ఎమౌంట్ తో ఇంకా సొమ్ములు వచ్చాయని చెప్పవచ్చు. రియాల్టీ షోలో అన్ని రోజులు పాల్గొన్నందుకు ముందుగా మాట్లాడుకున్న ప్రకారం 8 లక్షలు,గ్రాండ్ ఫినాలేకి చేరినందుకు 5లక్షలు,బిగ్ బాస్ స్పాన్సర్స్ నుంచి 3 లక్షలు వచ్చాయని అంటున్నారు.

50 లక్షలు కాకుండా అదనంగా 16లక్షలు రావడంతో కాన్సర్ పేషేంట్స్ కి 50లక్షలు ఇస్తానని చెప్పాడని అంటున్నారు. అయితే టాక్స్ లు పోను 50లక్షల్లో 46లక్షలు చేతికి వచ్చాయని అంటున్నారు. అయితే ఈ సొమ్ముని బ్యాంకు లో డిపాజిట్ చేసి, దానిపై వచ్చే వడ్డీని తనను అడిగిన కాన్సర్ పేషేంట్స్ కి ఇస్తాడా, ఈ సొమ్ముని ఏదైనా వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టి, వచ్చే లాభాలోంచి సాయం చేస్తాడా అనేది చూడాలి. ఇక బిజినెస్ లో ఉండడం,టివి సీరియల్స్ లో నటించడం,కొత్తగా సినిమాల్లో ఛాన్స్ లు రావడం ద్వారా కూడా కౌశల్ బానే సంపాదిస్తాడు.