పెళ్లి చూపులు షో కి సుమ రోజుకి ఎంత పారితోషికం తీసుకుంటుందో తెలిస్తే మతిపోతుంది

బుల్లితెర మీద యాంకర్ గా తనదైన ముద్ర వేసిన సుమ. నెంబర్ వన్ యాంకర్ గా నిల్చింది. గడిచిన కొన్ని దశాబ్దాలుగా సక్సెస్ కి మారుపేరుగా సుమ పేరు వినిపిస్తోంది. షో ఎలాంటిదైనా ఆమె యాంకర్ అయితే చాలు హిట్ అవుతుందన్న మాటా వచ్చేసింది. స్టార్ మహిళ ప్రోగ్రాం తో స్టార్ యాంకర్ గా సుమ మారిపోయింది. అది సినిమా ఫంక్షన్ అయినా, టివి షో అయినా ఏదైనా సరే,సుమ యాంకర్ అయితే చాలా ఆ ప్రోగ్రాం హిట్ కింద లెక్క. హాస్యం మేళవించి,మాటల్లో స్పష్టత,చక్కని హావభావాలు ప్రదర్శిస్తూ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ ఆ ప్రోగ్రాం పట్ల ఏకాగ్రత కల్పించడం సుమకే చెల్లింది. అయితే ఈ మధ్య ఈ మధ్య ప్రోగ్రామ్స్ ని కుదించేసుకుని,చాలా సెలెక్టివ్ గా మాత్రమే ఆడియన్స్ ముందుకు వస్తోంది.

బుల్లితెరపై ఎన్నో రికార్డులు సృష్టించిన సుమ ఇప్పుడు రెమ్యునరేషన్ విషయంలో కూడా ఓ సరికొత్త రికార్డు క్రియేట్ చేస్తోందని చెప్పాలి. రొటీన్ కి భిన్నంగా బుల్లితెరపై వస్తున్న షోస్ లో ఒకటైన పెళ్లిచూపులు షో స్టార్ మాలో బిగ్ బాస్ సీజన్ టు ముగిశాక, ఆ ప్లేస్ లో వస్తోంది. యాంకర్ ప్రదీప్ మాచిరాజు పెళ్లిచూపులు రియాల్టీ షో ద్వారా జీవిత భాగస్వామిని ఎంచుకుంటాడని అంటున్నారు.

ఇక ఈ షోకి సుమ యాంకర్ గా వ్యహరిస్తోంది. ప్రదీప్ కి పెర్ఫెక్ట్ జోడీని వెతికి పెట్టేపనిలో ఇంకా చెప్పాలంటే పెళ్లిపెద్దగా సుమ వ్యవహరిస్తోందన్న మాట. ఇక ఈ షో కోసం ఈమె తీసుకునే పారితోషికం గురించి రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. అయితే రెమ్యునరేషన్ ఎంతోతేలిస్తే షాకవ్వడం ఖాయం అంటున్నారు. దాదాపు 3నెలలకు పైగా జరగబోయే ఈ షో కోసం ఒక్కో ఎపిసోడ్ కి సుమ అక్షరాలా లక్షా 50వేల రూపాయలను అందుకుంటున్నట్లు బోగట్టా.

ఇక హిందీలో రాహుల్ కి దునియా,రాఖీ కా స్వయంవరం వంటి షో లు అలాగే తమిళంలో ఆర్యతో యంగవీటి మా పిళ్ళై పేరుతొ విజయవంతమైన ఇలాంటి షో లు విజయవంతం అయ్యాయి. అందుకే తెలుగులో కూడా రొటీన్ సీరియల్స్, ప్రోగ్రామ్స్ కి భిన్నంగా పెళ్లిచూపులు సరికొత్తగా ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఈ షో కోసం దేశవిదేశాల్లో ఎందరో తెలుగమ్మాయిలు రిజిస్టర్డ్ చేసుకోగా,అందులో 14మందిని సెలక్ట్ చేసారు.