అరవింద సమేత ఇలా ఉంటుందా – సెన్సార్ రిపోర్ట్ లో తేలిన నిజం…ఆ 10 నిముషాలు?

పండగ వస్తోందంటే అందిరికీ సందడే. కానీ ఆ పండగ సందర్బంగా తమ అభిమాన హీరో మూవీ విడుదల అవుతోందంటే ఇక ఆ పండగ స్పెషాల్టీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు పండగే పండగ. దసరా సందర్బంగా తారక్ నటించిన ‘ అరవింద సమేత .. వీర రాఘవ’మూవీ అక్టోబర్ 11న విడుదల కాబోతోంది. ఎన్నాళ్ళ నుంచి ఎదురుచూస్తున్న మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో తారక్ ఇన్నాళ్లకు నటిస్తున్న మొదటి సినిమా కావడంతో ఇటు అభిమానుల్లో,అటు ఇండస్ట్రీలో భారీ అంచనాలే ఉన్నాయి. పూజా హెగ్డే నాయికగా నటిస్తున్న ఈ సినిమా గురించి కొన్ని కీలక అంశాలు బయటకు వచ్చాయని, దానిప్రకారం ఈ సినిమా డిఫరెంట్ రేంజ్ లో ఉంటుందని అంటున్నారు.

ఇటీవల విడుదల చేసిన టీజర్,ట్రైలర్ కి కూడా విశేష స్పందన వచ్చింది. భారీ రేంజ్ లో విడుదల కాబోయే ఈ సినిమాకు అప్పుడే బిజినెస్ డీల్స్ కూడా భారీగానే జరిగిపోయాయి. దాదాపు 2గంటల 35నిమిషాల నిడివి గల ఈ సినిమాకు సెన్సార్ కూడా పూర్తయిందని,5,6కట్స్ తో యు /ఏ సర్టిఫికెట్ ఇచ్చారని అంటున్నారు. కట్స్ విషయంలో త్రివిక్రమ్ వివరణ ఇచ్చినా కట్స్ పడ్డాయని తెలుస్తోంది. సెన్సార్ సర్టిఫికెట్ వచ్చేయడంతో అభిమానుల్లో అప్పుడే పండగ వాతావరణం కనిపిస్తోందట.

ఇక ఈ సినిమాలో ఒక చెట్టు కీలకంగా కనిపిస్తోంది. అనగనగా పాటలో గాని,పెనిమిటి పాటలో గాని కనిపించే ఈ చెట్టు తారక్ కత్తిపట్టుకుని నడుస్తోంటే కూడా కనిపిస్తోంది. దీంతో ఏదో ప్రత్యేకత ఉంటుందని అంటున్నారు.ఇక సినిమాలో ఇంటర్ వెల్ కి ముందు తీసిన ఫైట్ హైలెట్ అవుతుందని, ఎన్టీఆర్ కెరీర్ లోనే అరుదైన ఫైట్ గా ఇది ఉంటుందని, అసలు ఇలాంటి ఫైటింగ్ ఈ మధ్యకాలంలో కంపోజ్ చేయలేదని, గుండెలు అదిరేలా ఫైట్ ఉంటుందని భోగట్టా.

వివి వినాయక్,కొరటాల శివ,బోయపాటి శ్రీను ఈ ముగ్గురు కల్సి ఈ ఫైట్ షూట్ చేశారా అన్నంతగా ఉంటుందని ఊరిస్తున్నారు. సినిమా మొదటి భాగంలో ఓ పదినిమిషాలు రాయలసీమ బ్యాక్ డ్రాప్ కనిపించి ఆతర్వాత హైద్రాబాద్ కి సినిమా షిఫ్ట్ అవుతుందని,అక్కడ హీరో హీరోయిన్స్ మధ్య లవ్ ఎపిసోడ్ నడుస్తుందని అంటున్నారు. హీరోయిన్ రాయలసీమ ఫ్యామిలీకి చెందిందని,కథలో ఇదే కీలక మలుపు అవుతుందని చెబుతున్నారు.