కౌశల్ ఫ్యూచర్ ప్లాన్ చూస్తే ఖంగు తింటారు…. అభిమానుల కోసం ఏమి చేస్తున్నాడో చూడండి

బిగ్ బాస్ రియాల్టీ షో విన్నర్ కౌశల్ గురించి ఇప్పుడు ఎక్కడ చూసినా చర్చే. ముఖ్యంగా యూట్యూబ్ లలో, వెబ్ సైట్స్ లో , సోషల్ మీడియాలో కౌశల్ గురించిన వార్తలే ఎక్కువ వైరల్ అవుతున్నాయి. నిజానికి ఈ షోకి రాకముందు ఓ మోడల్ గా,బిజినెస్ మ్యాన్ గా,టివి సీరియల్ నటుడిగా ఆయా రంగాలవారికి మాత్రమే తెలిసిన కౌశల్ రియాల్టీ షోతో మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఓ ఊపు ఊపేసాడు. దేశ సరిహద్దులు కూడా దాటి అభిమానం సంపాదించేసుకున్నాడు. హౌస్ లో తన తోటివాళ్ళు విరుచుకు పడుతున్నా సరే ఏమాత్రం పట్టు కోల్పోకుండా తాను అనుకున్న లక్ష్యం వైపు దూసుకుపోయాడు. కౌశల్ అభిమానులు కౌశల్ ఆర్మీగా ఏర్పడి ఫుల్లుగా సపోర్ట్ చేస్తూ వచ్చింది. అందుకే లక్షలాది అభిమానులను సొంతం చేసుకున్నాడు. బిగ్ బాస్ సీజన్ టు టైటిల్ విన్నర్ అయ్యాడు.

టైటిల్ గెలుచుకుని ఇంటికి వచ్చిన కౌశల్ తనకోసం కౌశల్ ఆర్మీ చేసిన పనులు తెలుసుకుని షాక్ తిన్నారు. తన గెలుపుని కౌశల్ ఆర్మీకి ఇచ్చేసిన కౌశల్ అంతటితో ఆగకుండా తనకోసం నాలుగు మాసాలు కష్టపడి సోషల్ మీడియాలో ,వెలుపల చేసిన పనులకు ఫిదా అవుతూ తనకోసం ఇంతాచేసిన అభిమానులకోసం తాను కూడా ఏదోఒకటి చేయాలని తపిస్తున్నాడు. అనుకున్నదే తడవుగా కార్యరూపంలోకి తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు.

అందుకే వచ్చే మూడు నెలల్లో ఇక కార్యక్రమాలు పెట్టుకోకుండా తనకోసం వచ్చే అభిమానుల ను కలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పట్టణాలు,నగరాలలో తిరిగి అభిమానులను కలవాలని కౌశల్ భావిస్తున్నాడట. రాజమండ్రి,కాకినాడ,ఏలూరు, విజయవాడ, గుంటూరు,ఒంగోలు,నెల్లూరు,తిరుపతి,కడప,కర్నూల్,అనంతపురం,నంద్యాల ఇలా అన్ని ప్రధాన పట్టణాలను అయితే ముందుగా తాను జన్మించిన విశాఖలో అభిమానులతో మీట్ అయ్యాక,ఒక్కో సిటీని కవర్ చేస్తూ పర్యటించే ఉద్దేశ్యంలో ఉన్నాడట.

మొత్తానికి ఆంధ్ర ఏరియా పర్యటన ఒకేఒక్క టూర్ తో చుట్టి రావాలని భావిస్తున్నాడట. ఆతర్వాత ఖమ్మం,వరంగల్,నల్గొండ,మహబూబ్ నగర్,ఆదిలాబాద్ ,ఇలా సెకండ్ స్టేజ్ లో కవర్ చేయాలని కౌశల్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.