తేజస్వి యాంకరింగ్ పై మండిపడుతున్న నెటిజన్లు…తేజస్విపై కౌశల్ ఆర్మీ దెబ్బ…షో నుంచి అవుట్

బిగ్ బాస్ షో లో ఉండగా,కౌశల్ పై దండయాత్ర సాగిస్తూ, అందరినీ అతనిపై ఉసిగొల్పుతూ రాజకీయాలు నడిపిన తేజస్వి బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చాక కూడా అదే ఒరవడి సాగిస్తూ వచ్చింది. అంతేకాదు, కౌశల్ ఆర్మీ పెయిడ్ టీమ్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతటితో వదలకుండా నేను హౌస్ లో అందరి మనసు గెలుచుకున్నానని,అసలైన విజేతను నేనేనని కూడా చెప్పుకొస్తూ, కౌశల్ ఆర్మీని అవమానించేలా ట్వీట్స్ చేస్తోంది. మరి కౌశల్ ఆర్మీ ఊరుకుంటుందా?

అదలా ఉంచితే నెటిజన్లు తేజస్వి తీరుపై మండిపడుతున్నారు. యాంకర్ గా వస్తున్న బ్రహ్మానందం తేజస్వి బానే ఉందా లేక మానసిక వ్యాధితో బాధపడుతోందా? కోట్లాది మంది అభిమానులు ఓట్లు వేసి కౌశల్ ని టైటిల్ విన్నర్ గా నిలబెట్టారు. బిగ్ బాస్ రియాల్టీ షో కూడా ముగిసిపోయింది. అయితే కౌశల్ గెలుపుని జీర్చించుకోలేక ఇలాంటి పోస్టులు పెట్టడం,ట్వీట్ లు చేయడం చూస్తుంటే చెప్పుకోలేని సమస్యతో బాధపడుతున్నట్లు వుంది. ఆమె మనసు గెలుచుకున్నవాళ్ళు ఎవరైనా ఆమెను ఎర్రగడ్డ ఆసుపత్రికి తరలిస్తే మంచిది’అంటూ నెటిజన్లు ట్రోల్స్ వేస్తున్నారు.

కౌశల్ మీద, కౌశల్ ఆర్మీ మీద ట్వీట్స్ , వెటకారాలు ఆపకపోతే నిన్ను ఎర్రగడ్డలో జాయిన్ చేస్తాం అంటూ నెటిజన్స్ వ్యాఖ్యానిస్తున్నారు. ఇక బ్రహ్మానందం మెయిన్ యాంకర్ గా స్టార్ మా లో వస్తున్నా లాఫ్టర్ ఛాలెంజ్ ప్రోగ్రాం లో యాంకర్ గా తేజస్విని పెట్టుకోవడంపై తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయినపుడు స్టార్ మా ను, బిగ్ బాస్ ని తిట్టిపోసిన తేజస్వినిని ఎలా యాంకర్ గా పెట్టుకున్నారో అర్ధం కావడం లేదంటూ కౌశల్ ఫాన్స్,ఆడియన్స్ మండిపడుతున్నారు.

తేజస్వి నోటి దురద ఎఫెక్ట్ మాములుగా లేదు. ఆమె చేసే పనులవలన కొంపలు మునిగేలా ఉన్నాయని స్టార్ మా యాజమాన్యం తలలు పట్టుకుంటోందట. ఇక మహిళలే ఎక్కువ సంఖ్యలో ఫోన్లు చేస్తూ తేజస్విని యాంకర్ గా తొలగించాలని డిమాండ్ చేస్తున్నారట. ‘కామెడీ షోలో పొట్టి పొట్టి దుస్తులతో ఆ దెయ్యం యాంకరింగ్ చూసి మా వాళ్లకు జ్వరాలు వచ్చేసాయి.

చిన్నపిల్లలు అయితే జడుసుకుంటున్నారు. ఇక డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తే భయపడే వాటికి దగ్గరగా ఉండొద్దని,ఆలాంటి వాటిని అసలు చూడొద్దని హెచ్చరించారు. ఇంకా నమ్మ బుద్ధి కాకపొతే చెప్పండి. మా ఫ్రెండ్స్ తీసుకుంటున్న ట్రీట్ మెంట్ వివరాలు, మెడిసిన్ బిల్లులు మీ వాట్సాప్ నెంబర్ కి పంపిస్తాం’అంటూ మా టివికి వేలకొద్దీ ఫోన్లు చేస్తున్నారట రియాల్టీ షో ఆడియన్స్.