‘పెళ్లిచూపులు’ కార్యక్రమం కారణంగా ప్రదీప్ ఇంట్లో రగడ…ప్రదీప్ ఏమి చేస్తాడో?

తెలుగు బుల్లితెర రంగంలో తిరుగులేని యాంకర్ గా కొనసాగుతున్న ప్రదీప్ త్వరలోనే పెళ్లిచూపులు అనే రియాల్టీ కార్యక్రమంతో ఆడియన్స్ ముందుకువస్తున్నాడు. ప్రదీప్ టెలివిజన్ కార్యక్రమాలతోనే కాకుండా సినిమాల్లో కూడా తనదైన శైలిలో నటిస్తూ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. మంచి కామెడీ టైమింగ్ ఉండడం ప్రదీప్ కు వరంగా మారింది. అది టీవీ షో అయినా, సినిమా అయినా, సినీ ఫంక్షన్ అయినా సరే ప్రదీప్ ఉంటే అక్కడ నవ్వులు విరబూస్తాయి.

ఎదుటివాళ్ల మీదే కాదు తనమీద తాను సెటైర్లు వేసుకోవడం ద్వారా కూడా ప్రదీప్ టన్నుల కొద్దీ కామెడీ పండిస్తాడు. ప్రదీప్ కు సామాజిక స్పృహ కూడా ఎక్కువే. అందుకే కొంచెం టచ్ లో ఉంటే చెబుతాను వంటి కార్యక్రమాల ద్వారా ఎంతో కొంత సందేశం ఇచ్చే ప్రయత్నం చేస్తుంటాడు. ఇప్పుడు తెలుగు బుల్లితెర చరిత్రలోనే ఎన్నడూలేని విధంగా ఓ రియాల్టీ పెళ్లిచూపుల కార్యక్రమంతో అందరినీ అలరించేందుకు సిద్ధం అయ్యాడు.

అయితే ఈ కార్యక్రమం ద్వారా తాను పెళ్లిచేసుకోబోయే అమ్మాయిని ఎంచుకుంటానని, ఓ రకంగా ఇది వెరైటీ స్వయంవరంలాంటిదని లాంటిదని ప్రదీప్ చెబుతున్నాడు. ఇప్పటికే వయసు మీదపడుతుండడంతో ఇంట్లోనూ, బయటా పెళ్లి గురించి ఒత్తిడి చేస్తున్నారట. దాంతో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ప్రదీప్ పెళ్లి కోసం రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో ప్రదీప్ ఇంట్లో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయని సమాచారం.

పెళ్లిచేసుకోవాలని అనుకుంటే లక్షణమైన సంబంధాలు చూసుకుని వాళ్లలో మంచి అమ్మాయికి మూడు ముళ్లు వేస్తే సరి అని తల్లిదండ్రులు భావిస్తున్నారట. ఇలా పబ్లిగ్లా టీవీ చానల్లో పెళ్లిచూపులు అంటే కొందరు అర్హులైన అమ్మాయిలు రాలేకపోవచ్చని, మంచి అమ్మాయిలందరూ టీవీలో బాగా మాట్లాడతారని గ్యారంటీ ఇవ్వలేమని, అలాగని టీవీలో కనిపించి అందరినీ ఒప్పించగలిగిన అమ్మాయిలు సూటవుతారని భావించలేమని ప్రదీప్ ఇంట్లో తలోరకంగా మాట్లాడుతున్నారట.

ఈ పెళ్లిచూపులు కార్యక్రమం కేవలం ఓ రియాల్టీ షో మాత్రమేనా లేక నిజంగానే తన పెళ్లిచూపుల కోసం ఏర్పాటు చేసుకున్న షోనా అనేది ప్రదీప్ కుటుంబ సభ్యులకు క్లారిటీ ఇవ్వకపోవడంతోనే ఈ కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడి ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలంటున్నాయి. ఏదేమైనా ప్రదీప్ కండక్ట్ చేయబోయే ఈ సరికొత్త పెళ్లిచూపుల కార్యక్రమంలో పాల్గొనేందుకు వేలల్లో అమ్మాయిలు దరఖాస్తు చేసుకుంటే వారిలో నుండి 14 మందిని సెలక్ట్ చేసారు.