అరవింద సమెత ఫంక్షన్ కి బాలయ్య రాకపోవటానికి కారణం తెలుసా? కంటతడి పెట్టిన ఎన్టీఆర్

ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో గానీ, బయట జనాల్లో గానీ అందరి దృష్టి ‘అరవింద సమెత’మూవీ గురించే చర్చ. రోజు రోజుకి హై ఓల్టేజి పెంచేస్తోంది ఈ మూవీ. ఎందుకంటే ఈ సినిమా కాంబినేషన్ అలాంటిది. త్రివిక్రమ్,తారక్ కాంబినేషన్ లో వస్తున్న తొలిచిత్రం కావడం,తమన్ బాణీలు అందించడం ఇలా ఎన్నో విశేషాలున్నాయి. దసరా పండుగ సందర్బంగా అక్టోబర్ 11న ఆడియన్స్ ముందుకు రాబోతున్న ఈ సినిమాకు సెన్సార్ కూడా పూర్తయింది. ఇక వేగంగా ప్రమోషన్ వర్క్ మొదలుపెట్టారు. ఇప్పటికే అనగనగా సాంగ్ వీడియో ప్రోమో విడుదల చేయగా, తాజాగా హిట్ సాంగ్ పెనిమిటి పాటను కూడా వీడియో ప్రోమో విడుదల చేస్తున్నారు.

అయితే ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి బాలకృష్ణ ఎందుకు రాలేదని తారక్ ని ఓ రిపోర్టర్ ప్రశ్నించడంతో ‘నేనంటే బాబాయ్ కి చాలా ఇష్టం. ఇక నాన్న హరికృష్ణ అంటే బాబాయ్ కి చాలా చాలా ఇష్టం. నాన్న పోయినపుడు బాబాయ్ అక్కడే ఉంటూ కనీసం ఫుడ్ కూడా ముట్టలేదు. ఇక ఫంక్షన్ కి వస్తానని చెప్పిన బాబాయ్ నాలో ఎమోషన్ చూసాక రాలేను అని చెప్పాడు’అని వివరించాడు.

లక్షలాది అభిమానుల ముందు తండ్రి మరణం ప్రస్తావించి ఎమోషన్ అయితే,అందరూ బాధపడినట్లే తాను కూడా తట్టుకోలేనని అందుకే రాలేకపోతున్నానని బాబాయ్ చెప్పాడని తారక్ చెప్పుకొచ్చాడు. ఇక ఈ చిత్రం ట్రైలర్ చూసాక తారక్ సింగిల్ రోల్ చేశాడా లేక డబుల్ రోల్ చేశాడా అనే అనుమానం కూడా చాలామందిలో ఉంది. నిజానికి తారక్ కి తన తాత గురించి నాన్నమ్మ చెబుతూ తాత కత్తి పట్టడం దగ్గర నుంచి తరాల చరిత్ర వివరిస్తుంటే, పవర్ ఫుల్ ఫ్లాష్ బ్యాక్ వస్తుందనే ఊహాగానాలు గుప్పుమంటున్నాయి.

అయితే తారక్ ఒక పాత్రే చేసినప్పటికీ రెండు రకాలుగా కనిపిస్తాడని అంటున్నారు. తొలిభాగంలో సరదాగా ప్రేమతో సాగాక,పూజ హెగ్డే తన ఫామిలీ గురించి చెప్పడంతో, అప్పటివరకూ తన రాయలసీమ బ్యాక్ డ్రాప్ దాచిన వీర రాఘవ అలియాస్ వీర రాఘవరెడ్డి కి ఎక్కడో తగులుతుంది. దీంతో సినిమా అనూహ్య మలుపు తిరుగుతుందని అంటున్నారు.

తారక్ హీరోయిజం ని ఇంటర్ వెల్ పీక్ లో చూపిస్తాడట త్రివిక్రమ్. దాంతో తారక్ రాయాలసీమకు షిఫ్ట్ అవ్వడం, తండ్రి నాగబాబుని అసలు విషయం అడిగి తెలుసుకోవడం,జగపతి బాబు కారణంగా ఎన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి,శాంతికోసం వీర రాఘవ చేసిన ప్రయత్నాలు,అంతపెద్దయేత్తున ఊచకోత ఎందుకు పాల్పడ్డాడు వంటి వన్నీ సినిమాలో భాగంగానే ఉంటాయి.