పెళ్లిరోజు వేళ చైతూ, సమంత షాకింగ్ డెసిషన్… షాక్ లో నాగార్జున

తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి ఉండే గుర్తింపే వేరు. అక్కినేని నాగేశ్వరరావు ఎవరు గ్రీన్ హీరోగా రాణిస్తే, నాగార్జున ఇప్పటికీ మన్మధుడిలా ఉంటాడు. ఇక ముద్దుచ్చే జంట ఎవరని అడిగితే నాగ చైతన్య,సమంత ల పేర్లే చెప్పి తీరాలి. వీరి పెళ్లయి,ఏడాది అయింది. అక్టోబర్ 6న వివాహ తొలివార్షికోత్సవం సందర్బంగా ఈ జంట అందరికీ షాకిచ్చే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నిజానికి పెళ్లయిన కొత్తలో యుఎస్ లో హనీమూన్ కి వెళ్లిన చైతు, సమంత కొన్ని రోజులకే షూటింగ్స్ కి వచ్చేసి అందరినీ షాక్ కి గురిచేసారు. ఇక రెండు సంప్రదాయాలకు చెందిన వీళ్లద్దరూ ప్రేమలో పడి,పెళ్లిపీటలు ఎక్కారు.

అయితే పెళ్లి కూడా రెండు సంప్రదాయాల్లో చేసుకుని రెండు చోట్ల రిసెప్షన్ కూడా ఇచ్చారు. గోవాలో హిందూ సంప్రదాయం ప్రకారం ఘనంగా చైతు,సమంతల పెళ్లి జరిగింది. ఆ మరుసటి రోజు క్రిస్టియన్ పద్దతిలో పెళ్లి జరిగింది. ఈ వేడుకకు అయితే కొద్దిమంది బంధు మిత్రులుమాత్రమే హాజరయ్యారు. అందుకే చెన్నైలో ఒకటి,హైదరాబాద్ లో మరొకటి ఇలా రెండుచోట్ల రిసెప్షన్ కూడా భారీ స్థాయిలో ఏర్పాటుచేశారు.

రెండు సంప్రదాయాల్లో పెళ్లి జరిగినందున అక్టోబర్ 6,7తేదీలు చైతు,సమంతల పెళ్లి రోజే. రొటీన్ గా స్పెషల్ పార్టీ ఎలాగో ఉన్నందున ఏదైనా భిన్నంగా నిర్ణయం ఉండాలని భావించారట. అందుకే కొత్తగా ఇండస్ట్రీకి వచ్చేవాళ్లను ఎంకరేజ్ చేసేవిధంగా ఓ వేదిక ఏర్పాటుచేయాలని భావిస్తున్నారట. ముఖ్యంగా నాగ చైతన్య సినీ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చినవాడే.

కానీ సమంత సినిమా ఛాన్స్ లకోసం ఎంతోకష్టపడితే గానీ దక్కలేదు. ఇలాంటి కష్టం ఔత్సాహికులకు ఉండకూడదన్న ఉద్దేశ్యంతో సమంత సూచన మేరకు ఓ వేదిక ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక అక్కినేని నాగార్జున, అమల కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అన్నపూర్ణ స్టూడియో ఎలాగో ఉన్నందున దీన్ని బేస్ చేసుకుని వేదిక ఏర్పాటుచేసి,కొత్తగా ఇండస్ట్రీకి రావాలనుకునే వాళ్లకు అండగా ఉండాలని చైతు,సమంత భావిస్తున్నారట.

టాలెంట్ వున్నవాళ్లను రికమండ్ చేసి ఛాన్సులు ఇప్పించాలని అనుకుంటున్నారట. మరి ఇది సఫలం అయితే చాలామంది కొత్తవాళ్లకు పండగే మరి.