Devotional

నవరాత్రుల్లో అమ్మవారికి ఈ పూలతో పూజ చేస్తే అష్ట ఐశ్వర్యాలు కోటి జన్మల పుణ్యం దక్కుతుంది

హిందువులకు దసరా అనేది ముఖ్యమైన పండుగ. శక్తి ఆరాధనకు ప్రాముఖ్యత ఇచ్చే పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కాబట్టి కొంతమంది శరన్నవరాత్రి అని కూడా పిలుస్తారు. దేవాలయాలలో ఈ తొమ్మిది రోజులు అమ్మవారికి తొమ్మిది రూపాల్లో అలంకరణలు చేస్తారు. ఇలా ఇంటిలో కూడా తొమ్మిది రోజులు అమ్మవారికి అలంకరణ చేసి పూజ చేయవచ్చు.

శరత్ ఋతువులో ఆశ్వయుజ మాసం,కార్తీక మాసం వస్తాయి. ఈ శరత్ ఋతువులో చంద్ర కాంతి చాలా ఎక్కువగా ఉంటుంది. నవరాత్రులు తొమ్మిది రోజులు పార్వతి దేవికి చాలా ప్రీతికరమైన రోజులు. అందువల్ల ఈ నవరాత్రుల్లో అమ్మవారికి ఏ పూలతో పూజ చేస్తే అష్ట ఐశ్వర్యాలు,సుఖ సంతోషాలు కలుగుతాయో తెలుసుకుందాం.

సంపెంగ,మందార పువ్వు,కదంబం, గన్నేరు పూలతో పూజించాలి. కొబ్బరి కాయ,అరటి పండు, దానిమ్మ,ఆపిల్ వంటి పండ్లను, ధూప దీప నైవేద్యాలతో స్త్రోత్రాలను పఠించి అమ్మవారికి పూజ చేయాలి.

అమ్మవారికి అత్యంత ఇష్టమైన పూలజాబితాలో మనకి ‘మల్లెలు’ .. ‘జాజులు’ .. ‘సంపెంగలు’ .. ‘పున్నాగులు’ .. ‘గన్నేరులు’ .. ‘కలువలు’ .. ‘తామరలు’ .. ‘తుమ్మిపూలు’ కనిపిస్తూ ఉంటాయి. ఈ పూలతో దుర్గాదేవిని పూజించాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఇలా అమ్మవారికి ఇష్టమైన పూలతో అర్చించడం వలన పుణ్యరాశి పెరుగుతుందనీ, మనోభీష్టాలు నెరవేరతాయని స్పష్టం చేస్తున్నాయి.