పెళ్లి చూపులు షో నుండి ఎలిమినేట్ అయిన నేహ అజ్మల్ చెప్పిన సంచలన నిజాలు

స్టార్ మా ఛానల్ లో బిగ్ బాస్ రియాల్టీ షో ముగియడంతో ఆ ప్లేస్ లో మోస్ట్ బ్యాచిలర్ ప్రదీప్ పెళ్లిచూపులు స్టార్ట్ అయ్యాయి కదా. ఈ ప్రోగ్రామ్ కి యాంకర్ సుమ హోస్ట్ గా కూడా వ్యవహరిస్తోంది. ఈ రియాల్టీ షో ద్వారా యాంకర్ ప్రదీప్ జీవిత భాగస్వామిని ఎంచుకుంటాడు. ఈ షో కోసం దేశవిదేశాల్లో ఎందరో తెలుగమ్మాయిలు రిజిస్టర్డ్ చేసుకోగా 14మందిని సెలక్ట్ చేసారు. ఒక్కో వారం ఒక్కొక్కరు ఎలిమినేట్ అవుతూ వస్తుంటే, చివరకు మిగిలిన అమ్మాయిని ప్రదీప్ పెళ్లాడతాడన్నది కాన్సెప్ట్. ఇది నిజమా,కదా, కేవలం సరదా కోసమా అనేది క్లారిటీ అయితే లేదు. ప్రదీప్ మాచిరాజు కోసం దేశవిదేశాల నుంచి వేలాదిమంది అప్లికేషన్స్ పెడితే, నాలుగు విడతలుగా చేసిన వడపోతలో 14మంది అమ్మాయిలు మిగిలారు. అయితే ఇందులోంచి ఎలిమినేట్ అయిన ఓ అమ్మాయి షో గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది.

దాదాపు 20 వారాలపాటు కొనసాగే అవకాశం ఉందని చెబుతున్న ఈ షోలో వారం వారం ఫిజికల్,మెంటల్ టాస్క్ లు ఉంటాయి. అయితే ఇందులో తనకు నచ్చిన వ్యక్తిని లైఫ్ పార్ట్ నర్ చేసుకుంటాడని అంటున్నారు. తొలివారం పూర్తవ్వడంతో ఎలిమినేషన్ రౌండ్ వచ్చేసింది. నచ్చిన నచ్చని విషయాలు చెప్పిస్తూ ఒక్కక్కొరినీ సేఫ్ జోన్ లోకి పంపగా చివరకు నేహా అజ్మల్ మిగిలింది.

అయితే ఆమెలో నచ్చని అంశం ఒక్కటి కూడా లేకున్నా,ఆమె నుంచి ఒక్కమాట కూడా రాలేదని,ఏ విషయం మాట్లాడకపోవడంతో బాధ కలిగిందని ప్రదీప్ చెప్పుకొచ్చాడు. చాలా సైలెంట్ గా ఉండడం వలన ఏమీ తెలుసుకోలేకపోయానని చెప్పాడు.’పెళ్లి చూపులు అనగానే మొదటగా ప్రదీప్ గురించి తెలుసుకోవాలని షో లోకి అడుగుపెట్టాను. నిజానికి అతని గురించి తనకు ఏమీ తెలీదు. తెలుసుకునే పనిలో కొంచెం బిడియంగా ఉండడంతో ఎలిమినేట్ చేసారు.

అయితే నేను కావాల్సినంతే మాట్లాడగా, అందరూ కొంచెం ఎక్కువగా మాట్లాడారు. అసలు షోలోకి రావడానికి నాలుగు రకాల టెస్టులు పెట్టారు. నా గురించి, ఇంట్లో వాళ్ళ గురించి, అలవాట్ల గురించి,చివరకు కేస్ట్ గురించి కూడా ప్రశ్నించారు. నాలుగు టెస్టులు అవ్వడంతో 10 రోజుల విరామం తర్వాత సెలెక్ట్ అయినట్లు వర్తమానం రావడంతో షో లోకి అడుగుపెట్టాను. షో లో చెప్పిన విషయాల్లో కొన్ని రిలే కాగా,మిగిలినవి ఎడిటింగ్ లో పోయాయి. అయితే ఎలిమినేట్ విషయంలో సాటి స్ఫై కాలేకపోతున్నాను అని అజ్మల్ వెల్లడించింది.