పెళ్లి చూపులు షో గుట్టు విప్పిన కౌశల్…ఆ గుట్టు ఏమిటో చూడండి

స్టార్ మా లో 100 రోజులకు పైగా ఓ ఊపు ఊపేసిన బిగ్ బాస్ రియాల్టీ షో ముగిసిపోయింది. అయితే ఈ షో స్థానంలో మోస్ట్ బ్యాచిలర్ ప్రదీప్ మాచిరాజు పెళ్లిచూపులు రియాల్టీ షో ఆరంభం అయింది. ఈ షో ద్వారా యాంకర్ ప్రదీప్ జీవిత భాగస్వామిని ఎంచుకుంటాడు. ఈ షో కోసం దేశవిదేశాల్లో వేలాదిమంది తెలుగమ్మాయిలు రిజిస్టర్డ్ చేసుకోగా, వడబోత తర్వాత 14మంది సెలక్ట్ అయ్యారు. వీళ్ళతో ప్రదీప్ డేటింగ్ చేస్తాడు. ఒక్కో వారం ఒక్కొక్కరు ఎలిమినేట్ అవుతూ వస్తుంటే, చివరకు మిగిలిన అమ్మాయిని ప్రదీప్ పెళ్లాడతాడు.

ఇక ఈ ప్రోగ్రామ్ కి యాంకర్ సుమ హోస్ట్ గా వ్యవహరిస్తోంది. ఏకంగా 14మంది అమ్మాయిలు ప్రదీప్ కోసం దేశవిదేశాల నుంచి వచ్చి, ప్రదీప్ ని మాటలతో గిలిగింతలు పెడుతున్నారు. వారి వారి మనస్తత్వాలను ప్రదీప్ తెలుసుకుంటున్న సమయంలో కౌశల్ పెళ్లిచూపులు సెట్ కి వెళ్ళాడు. బిగ్ బాస్ విన్నర్ గా నిల్చి తెలుగు రాష్ట్రాల్లో అందరి నోళ్ళలో నానుతున్న కౌశల్ ఒక్కసారిగా సెట్ లోకి వెళ్లి ప్రదీప్ కంగ్రాట్స్ చెప్పాడు. బిగ్ బాస్ షోలో
పెళ్లిచూపులు కోసం ఎంట్రీ ఇచ్చిన ప్రదీప్ ఇప్పుడు ఈ షో ద్వారా అద్భుతం చేస్తున్నాడని కౌశల్ చెప్పాడు.

పెళ్లిచూపులు షో కాన్సెప్ట్ చెప్పగానే షాకయ్యాయనని,ఇది ఓ విదేశీ షో అయినప్పటికీ ఇక్కడి నేచురాలిటీకి తగ్గట్టు ప్రదీప్ ఈ షో చేయడం అతడి లక్ అని కౌశల్ చెప్పుకొచ్చాడు. ఏకంగా 14మంది అమ్మాయిలు ప్రదీప్ కోసం కష్టపడడం ఊహకే అందడం లేదని అన్నాడు. అసలు ఇందులో ఎవరైనా ప్రదీప్ కి నచ్చుతారా, లేదా అంటే , దీనికి ప్రదీప్ కూడా జవాబు ఇవ్వలేకపోయాడని, నిజానికి మనస్తత్వానికి, పెళ్ళికి సంబందించిన విషయమని కౌశల్ వివరించాడు. నేషనల్ ఫిగర్ అయిపోయిన కౌశల్ చేసిన కామెంట్స్ షోకి ఎలాంటి కిక్కు ఇస్తుందో చూడాలి.