తాప్సి వందల కోట్ల సంపాదన వెనక రహస్యం ఏమిటో తెలుసా?

ప్రస్తుతం బాలీవుడ్ లో దూసుకుపోతున్న నటి తాప్సి తెలుగులో జుమ్మంది నాదం మూవీద్వారా సిల్వర్ స్క్రీన్ పై మెరిసింది. బిజినెస్ పరంగా కూడా ఈ ఢిల్లీ భామ బానే సంపాదిస్తోంది. అందుకే ఏకంగా బ్యాడ్మింటన్ లీగ్ టీమ్ ని కొనుగోలు చేసిందట. ఈమెకు స్పోర్ట్స్ అంటే మక్కువ కావడంతో ఓ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టీమ్ పూణే సెవెన్ ఏసెస్ టీమ్ ని కొనుగోలు చేస్తోందట. ఇండియాలో జరిగే బ్యాడ్మింటన్ లీగ్ లో పూణే జట్టుకి బలమైన టీమ్ గా పేరుంది. ఈమె ఆస్తులు కూడా బాగా సంపాదించడం వల్లనే కోట్లలో ఉండే ఈ టీమ్ కొనుగోళ్ల వైపు అడుగులు వేస్తోందని అంటున్నారు. ఎందుకంటే, అనవసరంగా ఒక్కరూపాయి కూడా ఖర్చు చేయదట ఈమె. అయితే డెన్మార్క్ క్రీడాకారుడు తో ప్రేమాయణం కారణంగా బ్యాడ్మింటన్

టీమ్ కొనుగులులో స్పీడ్ గా వ్యవహరిస్తున్నట్లు గుసగుసలు విన్పిస్తున్నాయి. తాప్సి అన్ని భాషల్లో కల్పి 30కి పైగా చిత్రాల్లో నటించింది. ఇందులో కొన్ని బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఇక అప్పుడప్పుడు తమిళం, తెలుగు మూవీలో కనిపిస్తున్న ఈ ఉత్తరాది బ్యూటీ హిందీలో మాత్రం మంచి రేంజ్ లో ఉంది. ఇటీవల త్రిల్లర్ మూవీస్,రియల్ లైఫ్ స్టోరీలు చేస్తోన్న తాప్సి,బాలీవుడ్ లో అవార్డులు కూడా సొంతం చేసుకుంటోంది.

నామ్ షా బనానే మూవీకి లక్స్ గోల్డెన్ రోజ్ అవార్డు 2018 సంవత్సరానికి లభించింది. జి సిరి అవార్డు,హిందూస్తాన్ టైమ్స్ మోస్ట్ స్టైలిష్ అవార్డు,జియోస్పా ఏషియా అవార్డు లభించాయి.టాప్ మోడల్ గా కూడా వ్యవహరిస్తున్న తాప్సి ఇటీవల వెడ్డింగ్ ప్లానర్స్ సంస్థను నెలకొల్పింది. వీటన్నింటి వలన ఆస్తులు బానే కూడబెట్టిందని, ఆదాయపు పన్ను కూడా కోట్లలో కట్టిందని అందరూ అనే మాట. ఈ అమ్మడి ఆస్థి 200 కోట్లు ఉంటుందని అంచనా.

బ్యాడ్మింటన్ లీగ్ టీమ్ ని కొనుగోలు చేయడం ద్వారా తన బ్రాండ్ నేమ్ పెరగడంతో పాటు స్పాన్సర్ షిప్ ల రూపంలో కూడా భారీ ఆదాయం వచ్చిపడ్తుందని అంటున్నారు. ఐపీఎల్ ఫ్రాంచైజీ కొనుగోలు చేయడమే భారత్ లో ప్రస్తుతం అంత్యంత లాభసాటి వ్యాపారంగా చెబుతుంటారు. క్రికెట్ టీమ్ ని కాకుండా బ్యాడ్మింటన్ టీమ్ ని కొనుగోలు చేయడం ద్వారా డెన్మార్క్ బ్యాడ్మింటన్ ఆటగాడు మాత్యాన్ బోస్ తో సన్నిహితంగా ఉండడమేనని అంటున్నారు.