పవన్, అలీకి తొలి పరిచయం ఎలా జరిగింది?

పవర్ స్టార్ పవర్ కళ్యాణ్, అలీ మధ్య ఎంతటి స్నేహం ఉందో మన అందరికి తెలిసిన విషయమే. సమయం వచ్చినప్పుడు అలీ పవన్ కళ్యాణ్ గురించి, పవన్ అలీ గురించి గొప్పగా చెప్పటం మనం విన్నాం. అయితే వారి ఇద్దరికి ఎలా పరిచయం అయిందో తెలిస్తే చాలా ఆశ్చర్యపోతారు.
అసలు అలీని పవర్ స్టార్ కి పరిచయం చేసింది ఎవరు? మొదటి పరిచయం ఎలా జరిగింది? ఆ వివరాల్లోకి వెళ్ళితే….చిరంజీవి ‘ముగ్గురు మొనగాళ్లు’ సినిమా చేస్తున్న సమయంలో చిరుకి జ్వరం వస్తే చూడటానికి అలీ వెళ్ళాడట. అక్కడే ఉన్న పవన్ కళ్యాణ్ అలీని చాలా ఆప్యాయంగా పలకరించాడట.

అదే వారి ఇద్దరి మొదటి పరిచయం. అప్పటికి పవన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వలేదు. కానీ అలీ అప్పటికే చాలా సినిమాలను చేసేసాడు. ఆ తర్వాత పవన్ సినిమాల్లోకి వచ్చాడు. అప్పటినుంచి అలీ లేకుండా పవన్ సినిమాలు లేవు. చాలా సందర్భాలలో పవన్ తన సినిమాలకు అలీ గుండె వంటి వాడని చెప్పాడు.

అయితే బుల్లితెర ప్రోగ్రాం ‘ఆలీతో జాలీగా’కి గెస్ట్స్ గా వచ్చిన ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ టీంలో సాయిధరమ్ తేజ్ ఆలీని చిరంజీవి, పవన్ కళ్యాణ్ లలో ఎవరంటే మీకు బాగా ఇష్టం అని అడిగితే ఆలీ మాత్రం చిరంజీవి గారంటేనే బాగా ఇష్టం అని చెప్పాడు. ఎందుకంటే ఆయన ద్వారానే నాకు పవన్ కళ్యాణ్ పరిచయం అయ్యాడు అని తన దైన స్టైల్ లో ఇద్దరి పైనా ప్రేమను చాటుకున్నాడు.