దీప్తి సునైన కి పెద్ద షాక్ ఇచ్చిన బాయ్ ఫ్రెండ్ షణ్ముఖ్ జస్వంత్… దీప్తి సునైనా పరిస్థితి ఏమిటో?

బిగ్ బాస్ సీజన్ టు ముగిసి 10రోజులు అవుతున్నా ఇంకా అందులోని కంటెస్టెంట్స్ మధ్య ఇంకా ఏదో జరుగుతూనే ఉంది. విన్నర్ గా గెలిచిన కౌశల్ అభిమానులను కల్సుకోవడంలో,మీడియాకు ఇంటర్యూలు ఇవ్వడంలో బిజీ బిజీ గా ఉండగా, సామ్రాట్,తనీష్,దీప్తి నల్లమోతు వంటివాళ్ళు కూడా తమ అభిప్రాయాలను మీడియాతో పంచుకున్నారు. అయితే రన్నరప్ గీతా మాధురి ఇంకా మీడియాకు ఇంటర్యూలు ఇవ్వలేదు. కాగా గతంలో ఎలిమినేట్ అయిన మరో కంటెస్టెంట్ దీప్తి సునయన ఇప్పుడు మళ్ళీ వార్తల్లోకి వచ్చింది.

దీప్తి సునయన బాయ్ ఫ్రెండ్ తాజాగా కౌశల్ ని కల్సి వచ్చాడు. ఇది పెద్ద చర్చకు దారితోస్తొంది. ఎందుకంటే, బిగ్ బాస్ హౌస్ లో ఉండగా కౌశల్ పై దీప్తి సునయన మండిపడుతూనే ఉంది. ఇద్దరూ ఉప్పూ నిప్పులా ఉండేవారు. మొదటి వారంలోనే సునయను ఎత్తుకున్నందుకు పెద్ద రభస సృష్టించింది. కౌశల్ సారీ చెప్పినా, అయ్యో నా చెల్లిలా భావించి అలా చేశానని చెప్పినా అస్సలు సునయన వినలేదు.

పెద్ద రాద్ధాంతమే చేసేసింది. ఇక టెలిఫోన్ టాస్క్ లో సునయన బాయ్ ఫ్రెండ్ షన్నుని కౌశల్ గుర్తుచేస్తూ,షన్ను షన్ను అని ఏడిపించడంతో ఆమె ఉద్వేగానికి లోనయ్యాలా చేసాడు. ఆ తర్వాత ఆమె ఎలిమినేట్ అయిపోయింది. నిజానికి సునయన హౌస్ లో నవ్వులు పూయిస్తూనే, మిగతా సమయంలో నిద్ర పోడానికే ట్రై చేసేది. ఈమె యూట్యూబ్ స్టార్ గా ఉన్నప్పుడు షణ్ముఖ్ జస్వంత్ తో కల్సి డాన్సులు,షార్ట్ ఫిలిమ్స్ చేయడం చేసేది.

ఫ్రెండ్ షిప్ రోజున తన బెస్ట్ ఫ్రెండ్ షన్ను అని చెప్పింది. కొందరు గుచ్చి గుచ్చి అడిగినప్పటికీ బెస్ట్ ఫ్రెండే అని చెప్పింది. అదే కౌశల్ హౌస్ లో ప్రస్తావించాడు. ఇక అసలు విషయానికి వస్తే, షన్ను మాత్రం విన్నర్ కౌశల్ ఇంటికి వెళ్లి బెస్ట్ విషెస్ చెప్పి, సెల్ఫీ దిగి,చాలా టైం అక్కడ స్పెండ్ చేసి వచ్చాడు. ఎవరికోసమైతే సునయన హౌస్ లో గొడవ పడిందో,అదే వ్యక్తి ఇలా చేయడంతో ఆడియన్స్ షాక్ కి గురయ్యారు. సునయన కు భలే షాకిచ్చాడే అంటూ అనుకుంటున్నారు.