బిగ్ బాస్ ఫినాలే పూర్తీ అయ్యి వారం రోజులు దాటినా గీతా మాధురి మీడియా ముందుకు ఎందుకు రాలేదు?

బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్ టు ముగిసి 10రోజులు అవుతున్నా ఇంకా ఆ చప్పుళ్ళు వినిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా విన్నర్ కౌశల్ పేరు ఇంకా సోషల్ మీడియాలో,అలాగే మీడియాలో కూడా మారుమోగుతోంది. గ్రాండ్ ఫినాలేలో కి వచ్చిన తనీష్, గీతా మాధురి,దీప్తి నల్లమోతు ,సామ్రాట్, కౌశల్ లో ఇప్పటివరకూ గీతా మాధురి మీడియాకు ఇంటర్యూ ఇవ్వలేదు. మిగిలిన నలుగురు మీడియాకు వెళ్లడమో ,మీడియా సంస్థలు వస్తే ఇంటర్యూ ఇవ్వడమో జరిగినా,గీతా మాత్రం రాలేదు. అయితే త్వరలోనే మీడియా ముందు నా అభిప్రాయాలు వెల్లడిస్తానని అంటోంది.

ఇక సోషల్ మీడియాలో కూడా కౌశల్,సామ్రాట్,తనీష్ లు ఎప్పటికప్పడు అప్ డేట్స్ పెడుతున్నారు. తమ అభిమానులకు దగ్గరగానే ఉంటున్నారు. ఇక కౌశల్ విషయంలో గీతా వ్యతిరేకించిన సందర్భంలో కొందరు ఆమె పై సోషల్ మీడియాలో ట్రోల్స్ వేశారు. బిగ్ బాస్ వలన చాలా పనులు పెండింగ్ లో పడ్డాయని,ముఖ్యంగా పాటల విషయంలో ఎక్కువ పెండింగ్ ఉందని అయితే తనను అభిమానించిన ఫాన్స్ ని ఇప్పటికే మరిచిపోకుండా గుర్తుపెట్టుకుంటానని గీతా చెబుతోంది.

ఇక గీతను లైవ్ చాట్ లో కౌశల్ ఫాన్స్ ఎంతమంది ఉన్నారో,మీకు అంతమంది ఫాన్స్ ఉన్నారా అంటూ ఒకరు ప్రశ్నించడంతో నేను ఎవరితో పోల్చుకోనని నాకు నేనే కంపేర్ చేసుకుంటానని గీతా చెప్పుకొచ్చింది. బిజీ షెడ్యూల్ వలన మీడియా ముందుకు రావడం లేదని,తమ బంధు మిత్రులతో, అభిమానులతో వ్యక్తిగతంగా కల్సి మాట్లాడ్డం వలన కూడా కుదరడం లేదని చెప్పింది.