ఫస్ట్ టైం తన చెల్లెళ్ళ గురించి చెప్పిన యంగ్ టైగర్

అభిమానులు ఎన్నాళ్ళ నుంచి ఎదురుచూస్తున్న మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో టాలీవుడ్ యంగ్ టైగర్ తారక్ హీరోగా వస్తున్నా మొదటి సినిమా ‘ అరవింద సమేత .. వీర రాఘవ’మూవీ అక్టోబర్ 11న విడుదల కాబోతోంది. దీంతో ఇటు అభిమానుల్లో,అటు ఇండస్ట్రీలో భారీ అంచనాలే ఉన్నాయి. పూజా హెగ్డే నాయికగా నటిస్తున్న ఈ సినిమా పై భారీ హైప్ క్రియేట్ అయింది. ప్రమోషన్ వర్క్ వేగం పుంజుకుంది. ఇక ఇదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ఓ ఇంటర్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. నిజ జీవితంలో ఓ కొడుకుగా, అన్నగా, భర్తగా, తండ్రిగా,ఇలా మంచి పేరు తెచ్చుకోవాలన్నదే నా తపన అని చెప్పాడు.

వాస్తవానికి తండ్రి పోయిన బాధ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నామని,తల్లి ,పెద్దమ్మ మాత్రం నెమ్మదిగా కోలుకుంటున్నారని కంటతడి పెడుతూ తన ఇంటి సంగతులు షేర్ చేసుకున్నాడు. ఇలాంటి కష్టకాలంలో భార్య ప్రణతి అందించిన ఓదార్పు ను వర్ణించలేనని, ఓ తల్లిలా ఓదార్చిందని తారక్ చెప్పాడు. నిజానికి అమ్మకు,ప్రణతికి పడుతుందో లేదో, ఏమైనా గొడవలు అవుతాయేమోనని మొదట్లో చాలా భయపడ్డానని అయితే, వాళ్లిద్దరూ బాగా కలిసిపోయారని చెప్పాడు.

నిజానికి అత్తా కోడళ్ళే అయినా తల్లీ కూతుళ్లలా మసలుతారని అన్నాడు. పెళ్ళికి ముందు వాళ్లిద్దరూ బాగా కలిసిపోవాలని కోరుకున్నానని, అయితే అనుకున్నదానికన్నా వాళ్ళిద్దరి మధ్యా మంచి అండర్ స్టాండింగ్ వచ్చేసిందని అన్నాడు. ఇంకా చెప్పాలంటే , ప్రణతి మా ఇంట్లో అడుగుపెట్టాక అమ్మకు కూతురు లేని లోటు తీరిందన్నాడు.

మా అమ్మవాళ్ళు మొత్తం తొమ్మిది మంది. వాళ్ళ సంతానంలో 5 గురు అమ్మాయిలున్నారు. వాళ్లంతా సొంత చెల్లెళ్లుగా భావిస్తుంటాను. వాళ్ళ ఐదుగురితో కూడా ప్రణతి బాగా మూవ్ అవుతోంది. తన పెళ్ళితోనే బాధ్యత తీరలేదని అక్క,చెల్లెలందరికీ పెళ్లిచేసి, వాళ్ళ జీవితాలను చక్కదిద్దే బాధ్యత తనకుందని ఫీలవుతాను. ఎన్టీఆర్ లాంటి అన్న వున్నాడని గర్వపడేలాగా వాళ్ళు ఉండాలన్నదే నా కోరిక’అని తారక్ చెప్పుకొచ్చాడు.