పావని రెడ్డి లవ్ లైఫ్ లో ఎవరికీ తెలీని నిజాలు ఇవే…ఆమె ఇప్పుడు ఎక్కడ ఉందో?

కాలేజ్ డేస్ నుంచి సినిమాలో చేరాలనే డ్రీమ్ ఉండడంతో స్క్రీన్ మీద మెరిసిన పావని రెడ్డి 1987ఆగస్టు 20 జన్మించింది. హీరోయిన్ కావాలని కలలు కన్న ఈ అమ్మడు యాదృచ్ఛికమో ఏమోగానీ డ్రీమ్ అనే మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఇక అగ్నిపూలు సీరియల్ తో బుల్లితెరమీద కూడా బోల్డంత నేమ్ తెచ్చుకుంది. అలాగే తమిళంలో రెట్టయి వాల్ కురివై సీరియల్ అలాగే వజ్రం అనే సినిమాలోనూ నటించింది. ప్రస్తుతం చిన్న తంబీ అనే తమిళ సీరియల్ లో నటిస్తోంది. విజయ టివిలో ప్రసారమవుతున్న ఈ సీరియల్ లో ఈమె సరసన ప్రజీమ్ యాక్ట్ చేస్తున్నాడు.

విజయ టీవీలో ఈ అమ్మడి సీరియల్ బాగానే పాపులర్ అయింది. ఇక కోలీవుడ్ లో కూడా కొన్ని మూవీస్ లో నటిస్తోంది. గలాటా అనే పత్రికలో పావని రెడ్డి గురించి వచ్చిన ఫోటో షూట్ ఇండస్ట్రీలో వైరల్ అయింది. విపరీతంగా చర్చ నడుస్తోంది. ఈ ఫోటోలు చూసి ప్రముఖులు సైతం మెస్మరైజ్ అయ్యారట. ఇక సొంతిల్లు కూడా చెన్నైలో కొన్నట్లు కూడా టాక్ వచ్చింది. అక్కడే సెటిల్ అవ్వబోతున్నట్లు కూడా సన్నిహితుల దగ్గర చెప్పుకొచ్చిందట.

పావని రెడ్డి లైఫ్ నిజానికి పూలబాట కాదు. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో జోరుగానే నటిస్తున్నప్పటికీ గతకాలపు జ్ఞాపకాలు మరిచిపోనివ్వడం లేదట. సాధారణంగా టీవీల్లో గానీ, సినిమాల్లో గానీ కల్సి నటిస్తే, వాళ్ళ మధ్య స్నేహం చిగురించి అది కాస్తా ప్రేమగా మారి,పెళ్లి వరకూ వెళ్తున్న ఘటనలు ఎన్నో వున్నాయి.

అయితే ఎంతగా ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ ఆ తర్వాత స్పర్ధలు వచ్చి విడిపోవడం కూడా అంతే వేగంగా జరిగిపోతోంది. ఒక్కోసారి చిన్న చిన్న అబద్దాలే పెనుభూతంగా మారిపోయి, ప్రాణాల మీదికి తెస్తోంది. ఇక అప్పటిలో తీవ్ర సంచలనం సృష్టించిన టివి నటుడు ప్రదీప్ సూసైడ్ కూడా ఇలాంటి బాపతే.

టివి నటి పావని రెడ్డి ని పెళ్లాడిన ప్రదీప్ కొంతకాలానికే తన ఇంట్లోని ఆత్మహత్యకు పాల్పడడం బుల్లితెర,అలాగే సినీ వర్గాలను కూడా దిగ్భాంతికి గురిచేసింది. దుబాయ్ నుంచి వచ్చిన ఫ్రెండ్ శ్రవణ్ కి ఇంట్లో ఆశ్రయం ఇచ్చి, చివరకు అతడి కారణంగానే సంసారంలో కలతలు రేగి,ప్రదీప్ సూసైడ్ కి కారణం అయింది.

అందరినీ కలచివేసిన ఈ ఘటనపై అప్పట్లో పావని రెడ్డి మాట్లాడుతూ తమ కాపురం ఎంతోహాయిగా సాగిపోతుంటే, చిన్నపాటి తేడాకే సూసైడ్ చేసుకున్నాడని వివరించింది. ఇక భర్త మరణంతో అందరూ తన వైపే వేలెత్తి చూపించడం వలన తట్టుకోలేక కొన్నాళ్ళు అజ్ఞాతంలోకి వెళ్లిన పావని రెడ్డి, చెన్నై చేరుకొని,అక్కడ తనకు పరిచయం గల టివి సినీ నటుల సాయంతో మళ్ళీ బిజీ గా మారిపోయింది.