నేను జీరో అవ్వడానికి ఆ సినిమా చేయకపోవడమే అంటూ సంచలన కామెంట్స్ చేస్తున్న సందీప్ కిషన్

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ఎవరికెవరూ తీసిపోరు. యువ హీరోలు తమతమ రేంజ్ లలో సినిమాల్లో నటిస్తూ హిట్స్ అందుకుంటున్నారు. ముఖ్యంగా చిన్న సినిమాల్లో యాక్ట్ చేసే చిన్న హీరోలు కలెక్షన్స్ లో టాప్ రేంజ్ ని చేరుకుంటున్నారు. అయితే ఒక్కరి విషయంలో పాపం ఎంత కష్టపడ్డా ఏమాత్రం లాభం దక్కడం లేదు. అలాంటి పరిస్థితిని ఎదుర్కొనే హీరోల్లో సందీప్ కిషన్ గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి. ఏటా రెండు మూడు సినిమాలు దక్కించుకుంటున్నా హిట్ మాత్రం రావడం లేదు. ఇప్పటివరకూ దాదాపు 20సినిమాలు చేసాడు. ఒక్కటి కూడా బ్రేక్ ఇవ్వలేదు.

ఈ నేపధ్యంలో గతంలో తాను మిస్సయిన రెండు సినిమాలు గురించి చెబుతూ,అవేకనుక చేసివుంటే, ఈవేళ పరిస్థితి మరోలా ఉండేదని సందీప్ కిషన్ అంటున్నాడు. హ్యాపీడేస్ సమయంలో రోల్ మిస్సయ్యాడు. శే’ఖర్ కమ్ముల గారు దర్శకునిగా ఎంట్రీ ఇస్తూ తీసిన హ్యాపీ డేస్ లో దాదాపు అన్ని పాత్రలకు ట్రై చేసాను. చివరగా రాజేష్ పాత్ర కు సెలక్ట్ అయ్యాను.

అయితే తెలంగాణా యాస రాకపోవడంతో ఛాన్స్ మిస్సయిపోయాను. ఆ సినిమా చేసి ఉంటే నా కెరీర్ ఎక్కడికో వెళ్ళ్లేది’అని సందీప్ చెప్పుకొచ్చాడు.’ఇక ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వం వహించిన ‘అష్టా చెమ్మా’మూవీలో రోల్ కోసం ఆడిషన్ కి వెళ్ళాను. అయితే నాకు తగిన పాత్ర లేదని, అప్పటికే హీరోగా నాని ని సెలెక్ట్ చేసేశామని చెప్పడంతో పెద్ద ఛాన్స్ మిస్సయ్యాను’అని సందీప్ అంటున్నాడు.

హ్యాపీడేస్, ‘అష్టా చెమ్మా’ మూవీస్ లో చేసి ఉంటే కెరీర్ బాగుండేదని చెబుతున్న సందీప్ తాజాగా సూపర్ స్టార్ కృష్ణ కూతురు ఘట్టమనేని మంజుల రచించి దర్శకత్వం వహించిన ‘మనసుకు నచ్చింది’ మూవీ లో నటించాడు. అయితే ఆ సినిమా ప్రమోషన్ వర్క్ అదిరిపోయే రేంజ్ లో సాగినా ఫలితం మాత్రం నిరాశ కలిగించింది. దీంతో హిట్ తలుపు ఎప్పుడు తడుతుందా అని సినీ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన ఈ యువ హీరో తపిస్తున్నాడు.