అరవింద సమేత US ప్రీమియర్ షో రివ్యూ
యంగ్ టైగర్ ఎన్టీఆర్,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న అరవింద సమేత వీర రాఘవ సినిమా అక్టోబర్ 11 గురువారం అంటే రేపు విడుదల అవుతుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌లో నిర్మాత ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ఈ సినిమాను ఎక్కడ రాజీ పడకుండా నిర్మించారు. ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో కుటుంబ విలువలకు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. సినిమా ఎలా ఉంటుందో అని తెలుగు రాష్ట్ర ప్రజలు,ఎన్టీఆర్ అభిమానులు తాహతహలాడుతున్నారు. అయితే ఒక రోజు ముందుగానే US లో ప్రీమియర్స్ వేస్తారు. దాంతో ఆ టాక్ కూడా చాలా త్వరగా వచ్చేసింది.
ఈ సినిమా అమెరికాలో 500 లొకేషన్స్ లో విడుదల అవుతుంది. వరుస హిట్స్ తో జోరు మీద ఉన్న ఎన్టీఆర్ ఈ సినిమాలో విశ్వరూపం చూపాడట. తెలుగులో ఇప్పటికే చాలా ఫ్యాక్షన్ నేపధ్యం ఉన్న సినిమాలు వచ్చాయి. ఆ సినిమాలలో చివరకు విలన్ చనిపోవటం వంటివి జరుగుతుంది. కానీ అరవింద సమేతలో మాత్రం దానికి విరుద్ధంగా చూపారట. యుద్ధం ముగిసిన తర్వాత ఏమి జరిగిందో చూపారు.
ఈ సినిమాలో వీర రాఘవగా నటించిన ఎన్టీఆర్ ఒక వైపు రౌద్ర రసం,సాఫ్ట్ నేచర్ రెండిటిని బాగా పండించాడట. ఇంటర్వెల్ పది నిమిషాల ముందు ప్రారంభం అయినా ఎన్టీఆర్ విజృంభణ క్లెమాక్స్ వరకు ఎదురు లేకుండా నడుస్తుంది. ముఖ్యంగా ఎమోషన్ సీన్స్ లో ఎన్టీఆర్ నటన పిక్స్ కి వెళ్ళింది.
పూజ హేడ్గే తన పాత్ర పరిధి వరకు బాగా చేసింది. గ్లామర్ డోసు బాగా పెంచేసింది. తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. ఫ్యాక్షన్ కుటుంబాలలో ఆడవారు పడుతున్న బాధలను ఈ సినిమాలో త్రివిక్రమ్ బాగా చూపించాడు. ఈ సినిమాలో స్వచ్ఛమైన రాయలసీమ భాషతో డైలాగ్స్ చెప్పించాడు త్రివిక్రమ్. ఫస్ట్ ఆఫ్ చూసి ఎంత ధ్రిల్ ఫీల్ అవుతారో సెకండ్ అఫ్ చూసి కూడా అంతకన్నా ధ్రిల్ ఫిల్ అవుతారు. ఈ సినిమాను రాయలసీమ మహిళల కోణం నుండి తీసాడు త్రివిక్రమ్.