వెండితెర నుండి బుల్లితెరకు టర్న్ అయిన బ్రహ్మానందం హిట్ అయ్యాడా….ప్లాప్ అయ్యాడా?
ఒకప్పుడు బ్రహ్మానందం సినిమాలో ఉంటే ఆ సినిమా హిట్ అనే టాక్ ఉండేది. చిన్న హీరో అయినా పెద్ద హీరో అయినా బ్రహ్మనందం ఉంటే సినిమా హిట్ అయ్యేది. బ్రహ్మానందం పారితోషికం పెంచేయటం, ఆ పారితోషికంతో ఇద్దరు ముగ్గురు జబర్దస్త్ కమెడియన్స్ రావటంతో బ్రహ్మనందం హావ క్రమంగా తగ్గిపోయింది. అలాగే బ్రహ్మి ఉన్న సినిమాలు కూడా ప్లాప్స్ రావటంతో క్రమంగా దర్శకులు కూడా బ్రహ్మి వైపు చూడటం మానేశారు. దాంతో బ్రహ్మి తన దృష్టి బుల్లితెర మీద పెట్టాడు.
బ్రహ్మానందం చేస్తున్న తెలుగు లాఫ్టర్ చాలెంజ్‌కు నెగిటివ్ టాక్ వచ్చింది. షో అస్సలు బాలేదని తేల్చేస్తున్నారు ప్రేక్షకులు. ఇప్పటికే వచ్చిన రెండు ఎపిసోడ్లను చూసి ప్రేక్షకులు కూడా డిసైడ్ చేసారు షోలో అస్సలు పసలేదని. దానికితోడు తేజస్వి యాంకరింగ్ కూడా షోకు మైనస్ గా మారిందనే ప్రచారం జరుగుతుంది. బ్రహ్మి లాంటి స్టార్ యాక్టర్ అక్కడ కనిపిస్తున్నా కూడా ప్రేక్షకులు మాత్రం ఈ షో వైపు పెద్దగా చూడటం లేదు.
దాంతో కచ్చితంగా రెండు వారాలు ముగిసేసరికి ఇది ఫ్లాప్ షో అని నిర్వాహకులకు కూడా అర్థం అయిపోతుందేమో..? బడా స్క్రీన్ కలిసిరావడం లేదని చిన్ని స్క్రీన్ పైకి వస్తే ఇక్కడ కూడా బ్రహ్మానందం టైమ్ బ్యాడ్ అయిపోయింది. మరి ఇప్పుడు ఈయన ఏం చేస్తాడో చూడాలిక..!