కమెడియన్ కోవై సరళ గురించి తెలియని చేదు నిజాలు… ఆమె ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉందో తెలుసా?
భారతీయ చలన చిత్ర పరిశ్రమలో మొదటి నుండి కమెడియన్స్ లో మొదటి నుంచి మగవాళ్ళదే హవా కొనసాగుతుంది. అటువంటి ఈ పరిశ్రమలో కోవై సరళ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఆమె తెలుగు,తమిళం బాషలలో సుమారుగా 750 సినిమాలను చేసింది. తెర మీద కోవై సరళ కనపడగానే నవ్వని అభిమాని లేడంటే అతిశయోక్తి లేదు. ఆమె బుల్లితెర పై కూడా తన హవాను చాటింది. సినీ రంగానికి ఒక ఊపు ఊపుతున్న కోవై సరళ జీవితం మాత్రం కన్నీటి మయమే. ఆమె మొదటి నుంచి కష్టాలను ఎదురు ఇదుతూనే ఉంది.
కోవై సరళ కు నలుగురు అక్కల బాధ్యత ఉండటంతో వారి బాధ్యతలను నిర్వర్తించటానికి ఆమె చాలా కష్టాలను పడింది. ఆమెకు ఇష్టం లేకపోయినా సినీ రంగానికి వచ్చి నటించటం మొదలు పెట్టింది. ఆమె అక్కల పిల్లల అందరిని సెటిల్ చేసేసింది. వారందరూ అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటూ హాయిగా జీవిస్తున్నారు.
కోవై సరళ ఈ భాధ్యతలను నిర్వహించటానికి అవివాహితగానే మిగిలిపోయింది. ప్రస్తుతం ఆమెకు ఎటువంటి అవకాశాలు లేవు. ఆమె అనారోగ్యంతో బాధ పడుతున్న సరే ఆమె అక్కలు గాని,వారి పిల్లలు గాని పట్టించుకున్న పాపాన లేదు. దాంతో ఆమె ఎంతో మనోవేదనకు గురి అవుతుంది.