ఈ హీరోయిన్ ని గుర్తు పట్టారా …ఆమె భర్త టాప్ సింగర్… ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా?
అమాయకపు పల్లెటూరి పిల్ల సీతా మహాలక్ష్మి గా ‘సినిమాలో ఒక్క ఛాన్స్ ప్లీజ్’ అంటూ ఖడ్గం సినిమాలో నటించి, ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్న నటి సంగీత. ఈమె ‘మా అయన సుందరయ్య,పెళ్ళాం ఊరెళితే,ఈ అబ్బాయి చాలామంచోడు,ఆయుధం,ఓరి నీ ప్రేమ బంగారం గానూ,నేను పెళ్ళికి రెడీ,టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్,ఆశల సందడి,నవ్వుతూ బతకాలిరా,సంక్రాంతి ఇలా ఎన్నో చిత్రాల్లో నటించింది. అయితే ఆతర్వాత భారతదేశం గర్వించ దగ్గ సింగర్స్ లో ఒకడైన క్రిష్ ని పెళ్ళిచేసుకుని సినిమాలకు విరామం ఇచ్చింది. పెద్ద పెద్ద సంగీత దర్శకుల దగ్గర పనిచేసిన క్రిష్ తమిళ,కన్నడ సినిమాల్లో చేసారు.
ఇక సంగీత నటిగానే కాదు గొప్ప భరత నాట్యకారిణి కూడా. అందుకే ఓ కాలేజీ యాజమాన్యం సంగీతను గెస్ట్ గా పిలిచారు. అదే ప్రోగ్రాం కి సింగర్ క్రిష్ రావడం తటస్థించింది. అలా ఒకరికొకరికి మాటలు కలవడం,అది ప్రేమగా రూపాంతరం చెంది,2009లో పెళ్లి చేసికున్నారు. వీరికి ఓ పాప పుట్టింది. ఆమె పేరు సివియా. అయితే సంగీత ప్రస్తుతం అప్పుడప్పుడు సినిమాల్లో మెరుస్తూ,టివి షోలకు జడ్జిగా వ్యవహరిస్తోంది. నటిగా, టివి యాంకర్ గా,డాన్సర్ గా, ఫీమేల్ ప్లే బ్యాక్ సింగర్ గా గుర్తింపు పొందిన సంగీత తెలుగు తెరపై సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తుందో లేదో చూడాలి.
నిజానికి హీరోయిన్ గా 2000దశకంలో హీరోయిన్ గా తన హవా చూపించిన సంగీత 1998లో తెరంగేట్రం చేసింది. 1978 అక్టోబర్ 21న శాంతారాం,భానుమతి దంపతులకు చెన్నైలో జన్మించింది. సంగీత కు రసిక అనే పేరుంది. తమిళంలో అదే పేరుతొ కొనసాగుతోంది. సూర్య,విక్రమ్ లకు తమిళంలో స్టార్ డమ్ తెచ్చిన పితామకం చిత్రంలో నటించిన సంగీత అందరి మెప్పు సంపాదించుకుంది. ఈ మూవీ తెలుగులో శివ పుత్రుడు టైటిల్ తో విడుదల చేసారు.
ఇక ఈమె తాత కె ఆర్ బాలన్ తమిళంలో 25సినిమాలకు పైగా నిర్మించి, ప్రముఖ నిర్మాతగా వెలుగొందారు. ఇక సంగీత ఎన్ని సినిమాలు నటించినా సరే,ఖడ్గం చిత్రంలో హీరోయిన్ కావడం కోసం చేసిన యాక్షన్ ఎప్పటికీ గుర్తుంది పోతుంది.