అలనాటి నటి సుజాత గుర్తు ఉందా…. ఆమె ఏ దేశానికీ చెందిందో తెలిస్తే షాకవుతారు
సుజాత ఈ పేరు వింటే మనకు ఠక్కున గుర్తొచ్చే సినిమాలు ఏమిటంటే గోరింటాకు, ఏడంతస్తులమేడ పసుపు పారాణి,సంధ్య,సుజాత వంటి ఆణిముత్యాల లాంటి చిత్రాలు. మొదట్లో హీరోయిన్ గా రాణించిన ఈమె ఆతర్వాత కాలంలో తల్లిగా, బామ్మగా,అవ్వగా ఇలా ఎన్నో పాత్రలతో నటించి మెప్పించింది. 1952డిసెంబర్ 10న పుట్టిన సుజాత,14ఏళ్ళ ప్రాయంలోనే తేజస్విని అనే సినిమాతో ఆడియన్స్ ముంగిటకు వచ్చింది. ఎన్నో సినిమాల్లో నటించిన ఈమె చివరి సినిమా శ్రీరామ దాసు. ఆతర్వాత కొంతకాలం అనారోగ్యం బారిన పడిన ఈమె 58ఏళ్ళ వయస్సులో అంటే 2006లో చెన్నై లోని తన నివాసంలోనే కన్నుమూసింది. ఈమె దాదాపు 300కి పైగా చిత్రాల్లో నటించింది .
సుజాత మొదట్లో తమిళంలోనే నటించి హిట్ కొట్టింది. 1974లో కె బాలచందర్ డైరెక్షన్ లో ‘అవాల్వోరు తుదల్ కథై’సినిమాతో పరిచయం అయిన సుజాత, ఆ సినిమా హిట్ తో కమల్ హాసన్,రజనీకాంత్ వంటి వారితో ఎన్నోచిత్రాల్లో కల్సి పనిచేసింది. ఆ సినిమాయే తెలుగులో అంతులేని కథగా వచ్చింది. 1979లో దాసరి నారాయణరావు డైరెక్షన్ లో వచ్చిన ‘గోరింటాకు’ సినిమాతో తెలుగులో సుజాత ఎంట్రీ ఇచ్చింది.
ఆ సినిమా కూడా సూపర్ హిట్ కావడంతో ఇక అచ్చమైన తెలుగు అమ్మాయిలా అప్పట్లో ఎన్నో చిత్రాల్లో ఛాన్స్ దక్కింది. ఎన్టీఆర్,అక్కినేని,కృష్ణ, శోభన్ బాబు,కృష్ణంరాజు ఇలా అప్పటి హీరోలందరి సరసన నటించి మెప్పించింది. 7ఏళ్ళ వ్యవధిలోనే ఆలయం 40కి పైగా చిత్రాలు చేసింది.
ఇక సుజాత తండ్రి ఉద్యోగ రీత్యా శ్రీలంక లోని గాలేలో సెటిలవ్వడంతో ఆమె అక్కడే పుట్టి పెరిగింది.
అందుకే ఆమె శ్రీలంక వాసి అని చెప్పవచ్చు. ఇక తండ్రి రిటైర్ మెంట్ తర్వాత సుజాత కుటుంబం కేరళ వచ్చేసింది. హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన సుజాతకు విజయావకాశాలు తగ్గడంతో ఇంటి యజమాని వాళ్ళ అబ్బాయిని ప్రేమించి, పెద్దలు ఒప్పుకోకపోయినా పెళ్ళిచేసుకుని,అమెరికా వెళ్ళిపోయింది. అయితే కొంతకాలానికి ఆమెకు అక్కడి వాతావరణం నచ్చలేదు.
దీంతో పురిటికోసం ఇండియా వచ్చిన సుజాత ఇక మళ్ళీ అమెరికా వెళ్ళలేదు. ఆమెకు ఓకే కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. 1980తర్వాత ఆమె తల్లిగా, అక్కగా, వదినగా ఇలా విభిన్న కేరక్టర్ రోల్స్ లో నటించింది. ఇక ఒకప్పుడు రజనీకాంత్ పక్కన హీరోయిన్ గా నటించిన సుజాత, ఆతర్వాత తల్లిగా, బామ్మగా కూడా నటించి మెప్పించింది. గోరింటాకు,సూత్రధారులు,గోరింటాకు వంటి చిత్రాలు పేరు తెచ్చిపెట్టాయి.
సర్కస్ రాముడు,సూరిగాడు,జస్టిస్ చక్రవర్తి,అహంకారి,ఎమ్మెల్యే ఏడుకొండలు,వంశ గౌరవం,బహుదూరపు బాటసారి,చంటి,పెళ్లి తదితర చిత్రాల్లో ఆమె నటన హైలెట్. ఇక 1997లోవచ్చిన పెళ్లి సినిమా లో ఆమె నటనకు నంది అవార్డు వచ్చింది. తమిళంలో ప్రతిష్ఠాత్మక కలైమామణి అవార్డు అందుకుంది.